AP Heat Temperatures: మొన్నటి వరకు చలి చంపేసింది. రెండు రోజులుగా రాష్ట్రంలో ఉక్కపోత మొదలైంది. ముఖ్యంగా పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువ వేడి రెండు రోజులుగా నమోదు అవుతున్నాయి. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
చలికాలం మొన్నటి వరకు విపరీతంగా చలి వేసింది. సింగిల్ డిజిట్‌కు పరిమితం అయింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. అయితే, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు మారిపోయాయి.
జనవరి నెలలోనే ఈ ఏడాది ఎండ దంచికొడుతోంది. రెండు రోజులుగా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఎండకాలం పూర్తిగా వచ్చాక పరిస్థితి ఏంటో అని కంగారు పడుతున్నారు.
ముఖ్యంగా కర్నూల్ జిల్లాల్లోని ఆదోనిలో నిన్న ఒక్కరోజు 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ ఏడాది రాష్ట్రంలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఫిబ్రవరి నెలలోనే ఉష్ణోగ్రతలు పెరిగిపోయే అవకాశం ఉంది. గత ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ఎండ తీవ్రత ఎక్కువ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.. మొన్నటి వరకు భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
మధ్యాహ్నం ఎండ, రాత్రి విపరీతమైన చలి. ఫిబ్రవరి రాకముందే ఎండ తీవ్రత పెరిగింది. ఒక్కసారిగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఇక ఈసారి ఎండలను ఎలా భరించాలో అని సాధారణ జనం నోట మాట..