Russia Ukraine War: రష్యా మిస్సైల్ దాడులతో శిధిలమౌతున్న ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్

ఉక్రెయిన్ రాజదాని కీవ్ నగరం బాంబు దాడులతో అట్టుడికింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికదాడులు రెండవరోజు కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ నగరాలపై రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో విధ్వంసకర దృశ్యాలే కన్పిస్తున్నాయి. జనం బిక్కిబిక్కుమంటూ భయపడుతూ జీవిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం వార్తలు వస్తున్నాయి.

Russia Ukraine War: ఉక్రెయిన్ రాజదాని కీవ్ నగరం బాంబు దాడులతో అట్టుడికింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనికదాడులు రెండవరోజు కూడా కొనసాగాయి. ఉక్రెయిన్ నగరాలపై రష్యా మిస్సైల్ దాడులు చేస్తోంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో విధ్వంసకర దృశ్యాలే కన్పిస్తున్నాయి. జనం బిక్కిబిక్కుమంటూ భయపడుతూ జీవిస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రాణనష్టం వార్తలు వస్తున్నాయి.

1 /5

భారీ ఎత్తున సాగిన మిస్సైల్ దాడులతో ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ విధ్వంసంగా మారింది. ఎక్కడ చూసినా దెబ్బతిన్న భారీ భవంతులే కన్పిస్తున్నాయి.

2 /5

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మకంగా నలువైపుల్నించీ దాడులు చేస్తున్నారు. భౌతిక దాడులతో పాటు సైబర్ దాడులు, మిస్సైల్ దాడులు, ఆర్టిల్లరీ స్ట్రైక్స్ ఇలా విభిన్నమైన దాడులు చేస్తున్నారు. 

3 /5

ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రంను రష్యా దాదాపుగా ఆక్రమించేసింది. 96 గంటల్లో మొత్తం సీజ్ చేయనుంది.

4 /5

కీవ్ రాజధాని నగరంలో ఉక్రెయిన్ సైనిక దళాలు..రష్యా ఎయిర్‌క్రాఫ్ట్‌ను కూల్చేశాయి. ఆ విమానం కాస్తా నివాసప్రాంతంపై పడటంతో మొత్తం అగ్నికి ఆహుతైంది

5 /5

రష్యా విమానం కూలిన ఘటనలో దెబ్బతిన్న అపార్ట్‌మెంట్ భవనాలు. రెండవ ప్రపంచయుద్ధం సమయంలో నాజీల దాడుల్ని గుర్తు చేస్తోందని వ్లాదిమిర్ పుతిన్ వ్యాఖ్యానించారు.