Naga Chaitanya Sobhita Engagement: నాగచైతన్య-శోభిత ఎంగేజ్‌మెంట్.. ట్రెండింగ్‌లో సమంత

Naga Chaitanya Sobhita Engagement Pics: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్ పూర్తయింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఎన్నో రోజులుగా వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా.. నేడు ఎంగేజ్‌మెంట్‌తో అధికారికంగా ప్రకటించారు. వీరి ఎంగేజ్‌మెంట్ పిక్స్‌ను అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. శోభితను తమ కుటుంబంలోకి ఆహ్వానించేందుకు ఎంతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. చైతూ-శోభిత ఎంగేజ్‌మెంట్‌తో సమంత పేరు నెట్టింట ట్రెండింగ్‌లో మారింది. #Samantha హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.
 

1 /9

ఎంతో ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య-సమంత.. అభిప్రాయభేదాలతో విడిపోయారు. ఇద్దరు విడాకులు తీసుకుని.. సోషల్ మీడియా వేదికగా వీడిపోతున్నట్లు ప్రకటించారు.  

2 /9

ఆ తరువాత ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీగా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే శోభితతో నాగ చైతన్య డేటింగ్‌లో ఉన్నాడంటూ వార్తలు తెరపైకి వచ్చాయి.  

3 /9

ఈ ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్నా.. వీరు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. ఇద్దరు కలిసి ఫారిన్ ట్రిప్‌లో ఉన్న పిక్స్‌ కూడా వైరల్ అయ్యాయి.  

4 /9

శోభిత తెలుగు అమ్మాయి. ఆమెది గుంటూరు జిల్లా తెనాలి. 2013లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకోవడం శోభిత వెలుగులోకి వచ్చారు.  

5 /9

2016లో బాలీవుడ్‌లో రోమన్ రాఘవ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేశారు. 2018లో అడవి శేషు నటించిన గూఢచారి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మేజర్ మూవీలోనూ కీలక పాత్ర పోషించారు.  

6 /9

సమంతతో విడాకులకు ముందే శోభితతో నాగ చైతన్యకు పరిచయం ఏర్పడిందనే ఓ రూమర్ ఉంది. సమంతతో విడాకులకు శోభిత ఓ కారణం అని కూడా ప్రచారం జరిగింది.  

7 /9

నాగ చైతన్యతో డేటింగ్‌ రూమర్స్‌పై గతంలో శోభిత స్పందిస్తూ.. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ దాట వేస్తూ వచ్చారు.   

8 /9

ఎట్టకేలకు ఇవాళ ఎంగేజ్‌మెంట్‌తో అధికారికంగా ప్రకటించేశారు. ప్రస్తుతం నాగ్-శోభిత ఎంగేజ్‌మెంట్ పిక్స్ వైరల్‌గా మారాయి.  

9 /9

వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌తో సమంత పేరు నెట్టింట మారుమోగిపోతుంది. #Samantha హ్యాష్ ట్యాగ్‌ను నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు.