Samudrik Shastra: అక్కడ పుట్టుమచ్చ ఉండే స్త్రీలు చాలా రొమాంటిక్‌గా ఉంటారట...

Samudrik Shastra about Women: సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలోని ప్రతీ పుట్టుమచ్చకు ఓ నిగూఢ అర్థం ఉంటుంది. పుట్టుమచ్చను బట్టి వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయొచ్చు.

  • Feb 28, 2022, 16:26 PM IST

Samudrik Shastra about Women: సాముద్రిక శాస్త్రంలో పుట్టుమచ్చలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శరీరంలో ఒక్కో భాగంలోని పుట్టుమచ్చ ఒక్కో రహస్యాన్ని తెలియజేస్తోంది. ఒక వ్యక్తి పుట్టుమచ్చలను బట్టి అతను ఎంత అదృష్టవంతుడో చెప్పవచ్చు. అదే సమయంలో సదరు వ్యక్తి ఎంత రొమాంటిక్ అనేది కూడా చెప్పవచ్చు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

1 /5

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. కుడి కన్నులో పుట్టు మచ్చ ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు. వారి వైవాహిక జీవితం సంతోషంగా, సాఫీగా సాగుతుంది.  

2 /5

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. తల మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు తమ భాగస్వామిని అమితంగా ప్రేమిస్తారు. ప్రతీ క్షణం తమ భాగస్వామిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.

3 /5

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. స్త్రీలకు మోకాళ్లపై పుట్టుమచ్చ ఉంటే.. వారిని రొమాంటిక్‌గా పరిగణిస్తారు. కుడి మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే.. అది వారి వైవాహిక జీవితం సంతోషంగా, సాఫీగా గడిచిపోతుందనడానికి సంకేతం. ఎడమ మోకాలిపై పుట్టుమచ్చ ఉంటే.. ప్రేమికులు తమ ప్రేమలో విజయవంతమవుతారు.  

4 /5

పెదవిపై పుట్టుమచ్చను ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. పెదవిపై పుట్టుమచ్చలు ఉన్న స్త్రీలు రొమాంటిక్ నేచర్ కలవారని సాముద్రిక శాస్త్రం చెబుతోంది.  

5 /5

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. మెడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు చాలా అదృష్టవంతులు. మెడ మధ్యలో పుట్టుమచ్చ ఉండడం కూడా శుభప్రదం. ఇది శృంగార స్వభావానికి సంకేతంగా పరిగణిస్తారు.