Sankranthiki Vasthunnam 3rd Day Collection: తెలుగులో ఇపుడు సీనియర్ హీరోల హవా నడుస్తుందని చెప్పాలి. ఈ కోవలో గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సోలో హీరోగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న వెంకటేష్ కు తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో తన తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు. అంతేకాదు సోలో హీరోగా తొలి రూ. 100 కోట్ల కొల్లగొట్టాడు.
Sankranthiki Vasthunnam 3rd Day Collection: గత కొన్నేళ్లుగా వెంకటేష్ హీరోగా తన ఉనికి కోసం పోరాడుతున్నాడు. గతేడాది పూర్తి మాస్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కి సైంధవ్ తో మొత్తంగా రూ. 10 కోట్ల షేర్ కూడా రాబట్టని వెంకటేష్.. తాజాగా ‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమాతో తొలి రోజే.. రూ. 27 కోట్ల షేర్ (రూ 45 కోట్ల గ్రాస్) వసూళ్లతో సంచలనం రేపాడు.
‘సంక్రాంతి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి కానుకగా సంక్రాంతి రోజే విడుదలైన వెంకటేష్ కు ఈ ఇయర్ శుభారంభాన్ని అందించింది. ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ. 106 కోట్ల గ్రాస్.. (రూ. 50 కోట్ల షేర్) రాబట్టి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. మొత్తంగా చాలా ఏరియాల్లో అంచనాలకు మించి వసూళ్లను రాబట్టింది.
హీరోగా వెంకటేష్ కు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సోలో హీరోగా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్ మూవీగా రికార్డులకు ఎక్కింది. అంతకు ముందు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ మూవీలు కూడా రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన అందులో వరుణ్ తేజ్ మరో హీరోగా ఉన్నాడు. కానీ సింగిల్ గా వెంకీ మామ నటించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో మూడు రోజుల్లో ఈ ఫీట్ అందుకోవడం మాములు విషయం కాదు.
సీనియర్ హీరోల్లో చిరంజీవి, బాలకృష్ణ తర్వాత ఈ ఫీట్ ను సోలో అందుకున్న హీరోగా వెంకటేష్ రికార్డులకు ఎక్కాడు. ఇక తెలుగు సీనియర్ టాప్ హీరోల్లో నాగార్జున తప్పించి మిగిలిన హీరోలు సోలోగా రూ. 100 కోట్ల క్లబ్ అనే ఫీట్ అందుకున్నారు. నాగ్ నటించిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’ రూ. 400 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన అందులో ఆయన మెయిన్ లీడ్ కాదు కాబట్టి ఆయన ఖాతాలో ఈ సినిమా రాదనే చెప్పాలి.
మొత్తంగా వెంకటేష్ రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన చిత్రాలన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కినవే కావడం.. అవన్ని దిల్ రాజు నిర్మించినవే కావడం మరో విశేషం.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికొస్తే.. ఇందులో పెద్దగా స్టోరీ లేకపోయినా.. తనదైన కామెడీ, స్క్రీన్ ప్లేతో లాక్కొచ్చాడు. మన దిమాగ్ ను పక్కన పెట్టి చూసి ఎంజాయ్ చేయాల్సిందే. మొత్తంగా 2025 బిగ్గెస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ముందు ముందు ఎలాంటి రికార్డుల బెండు తీస్తుందో చూడాలి.