Bank Money: మహిళలకు అదిరే శుభవార్త చెప్పిన ఎస్బిఐ..ఈ అవకాశం అస్సలు వదులుకోవద్దు

Bank Money: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బిఐ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికోసం ప్రత్యేకంగా ఓ స్కీమును అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ స్కీము గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 
 

1 /6

Bank Money:  దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా సరికొత్త స్కీమును ప్రవేశపెట్టింది. ఈ స్కీముకు ఎస్బీఐ స్త్రీ శక్తిలోన్ అనే పేరు పెట్టారు. మహిళలు తమ స్వంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు లేదా ఇప్పటికే ఉన్న బిజినెస్ ను విస్తరించేందుకు ఈ స్కీం ద్వారా రూ. 24లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు.   

2 /6

ఈ స్కీము ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలు తక్కువ వడ్డీ రేట్లకు లోన్ తీసుకోవచ్చు. రూ. 2లక్షల లోపు లోన్ కు అదనంగా  0. 5శాతం వడ్డీ రాయితీ కూడా లభిస్తుంది. రూ. 10లక్షల లోపు లోన్స్ కు పూచికత్తు అవసరం ఉండదు. ఈ స్కీమ్స్ పై ప్రాసెసింగ్ ఫీజు ఉండదు. తిరిగి చెల్లింపుల మీకు సౌకర్యవంతంగా ఉండే ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి.   

3 /6

వ్యాపారంలో కనీసం 51శాతం వాటా మహిళల పేరు మీద ఉండాలి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు లేదా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించేందుకు మాత్రమే ఈ లోన్ కు అప్లయ్ చేసుకోవచ్చు. 

4 /6

సమీపంలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ ను సందర్శించండి. బ్యాంకు వారు ఇచ్చే అప్లికేషన్ ఫారంను పూర్తి చేసి అవసరమైన డాక్యుమెంట్స్ ను జత చేసి బ్యాంకు వారికి సమర్పించాలి.   

5 /6

ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, వ్యాపారానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్, ఆదాయపత్రాలు, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ఇవ్వాలి.   

6 /6

బ్యాంకు మీ అప్లికేషన్ పరిశీలించిన తర్వాత మీ అర్హతలను బట్టి లోన్ ఇస్తుంది. ఆమోదించిన మొత్తం మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. ఈ స్కీమ్ మహిళలకు స్వయం ఉపాధి ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు మేలైన అవకాశం కల్పిస్తుంది. వ్యాపార రంగంలో కొత్త ఆవిష్కరణలు చేయాలని ఆశపడే మహిళలకోసం ఇది ప్రయోజనకరమైన స్కీమ్ అని చెప్పవచ్చు.