Shilpa Shetty: 50లో 20లా కనిపించడానికీ శిల్పా శెట్టి ఫాలో అవుతున్న చిట్కాలు ఇవే..

Shilpa Shetty: శిల్పా శెట్టి ఈ పేరు ఒకప్పటి యూత్ కు ఆరాధ్య దేవత. ఈ సాగరకన్య గురించి తెలుగు ఆడియన్స్ కు  కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. పేరుకు తగ్గట్టు శిల్పి ఉలిని పట్టుకొని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది శిల్పా శెట్టి శరీర సౌష్ఠవం. ఏజ్ 50 దాటినా.. ఇప్పటికీ అదే చెక్కు చెదరని అందంతో కుళ్లు కొనేలా చేస్తోంది. ఈమె బ్యూటీ సీక్రెట్ విషయానికొస్తే.. 

1 /7

శిల్పాశెట్టి  మధ్యలో సినిమాలకు దూరమైనా.. తన యోగాసనాలతో అభిమానులకు ఎపుడు దూరం కాలేదు. ఏజ్ 50 యేళ్లకు దగ్గర పడ్డ ఇప్పటికీ అదే శరీర సౌష్ఠవంతో అలరిస్తూనే విస్మయానికి గురి చేస్తోంది ఈ మంగళూరు భామ.

2 /7

శిల్పాశెట్టి దిన చర్య ప్రతి రోజు యోగాసనాలతో ప్రారంభం అవుతోంది. యోగాసనాలతో పాటు వేపుళ్లు, చిరు తిండ్లకు దూరంగా ఉండటమే శిల్పా శెట్టి బ్యూటీ సీక్రెట్.

3 /7

అంతేకాదు ప్రతి రోజు తన ఆహారంలో నీరు ఎక్కువగా ఉండేలా చూసుకుంటుంది. అంతేకాదు కొబ్బరి నీళ్లు, ఆకు కూరలు, నాని బెట్టిన పెసళ్లు, చిక్కడు గింజలను ఎక్కువగా తీసుకుంటుందట. అంతేకాదు రోజులో ఓ సారి గ్రీన్ టీ తీసుకుంటుంది. అవసరం మేరకు అన్నం, పప్పు, కూరలు ఆహారంలో భాగంగా తీసుకుంటోంది.

4 /7

శిల్పాశెట్టి విషయానికొస్తే.. రీసెంట్ గా  ఈ భామ రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ పోలీస్ ఫోర్స్'లో తార శెట్టి అనే పోలీస్ ఆఫీసర్‌లో పాత్రలో  మెప్పించింది.  

5 /7

శిల్పాశెట్టి సినిమాల విషయానికొస్తే..  హిందీలో షారుఖ్ హీరోగా నటించిన 'బాజీఘర్'మూవీతో  హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. పేరుకు హిందీ భామ అయినా.. తెలుగు సినిమాలతో శిల్పా శెట్టికి విడదీయరాని   అనుబంధమే ఉంది.

6 /7

శిల్పాశెట్టి.. టాలీవుడ్‌లో వెంకటేష్ హీరోగా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'సాహసవీరుడు సాగరకన్య' మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో మోహన్ బాబుతో  వీడెవండీ బాబు, నాగార్జునతో ఆజాద్, బాలకృష్ణతో భలేవాడివిబాసూ చిత్రాల్లో నటించింది.

7 /7

దాదాపు 7 యేళ్ల తర్వాత నికమ్మతో పాటు, హంగామా చిత్రాలతో పలకరించింది. రీసెంట్ గా  రోహిత్ శెట్టి 'ఇండియన్ పోలీస్ ఫోర్స్' వెబ్ సిరీస్ లో  తారా శెట్టి పాత్రలో మంచి నటనే కనబరించింది.