SHIVAM DUBE LOVE STORY: ప్రస్తుతం జరుగుతున్న IPL 2024 సీజన్ చాలా రసవత్తరంగా సాగుతోంది. ఫ్లేయర్స్ అందరూ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్ ఆటగాడు శివమ్ దూబే అయితే ఐపీఎల్ లో దుమ్మురేపుతున్నాడు. అలాంటి శివమ్ దూబే ప్రేమకథ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మంచి ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఈ జట్టుకు చెందిన శివమ్ దూబే చాలా బాగా ఆడుతున్నాడు. మైదానంలోలాగే శివమ్ దూబే ప్రేమకథలో కూడా ఎన్నో ట్విస్టులు ఉన్నాయి.
శివమ్ దూబే ఓ ముస్లిం యువతితో ప్రేమలో పడ్డాడు. అయితే మతాలు, సంప్రదాయాలు వేరే అవ్వడం వల్ల వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు మొదట అంగీకరించలేదు. ఆ తర్వాత ఒప్పుకున్నారు.
ఇరు కుటుంబాల సంప్రదాయం ప్రకారం, ఈ జంట రెండు సార్లు వివాహం చేసుకుంది.
శివమ్ దూబే 2021లో అంజుమ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. శివమ్ దూబే హిందూ మతానికి చెందినవారు కాగా, అంజుమ్ ఖాన్ ముస్లిం యువతి.
పెళ్లికి ముందు శివమ్ మరియు అంజుమ్ ఖాన్ ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేశారు. అయితే ఈ వార్త ఎవరికీ తెలియదు.
అంజుమ్ ఖాన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది. అంజుమ్ మోడల్ కూడా. కొన్ని హిందీ సీరియల్స్ మరియు మ్యూజిక్ ఆల్బమ్‌లలో కూడా పనిచేశారు.
అంజుమ్ ఖాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. అంతేకాకుండా తరచుగా శివమ్ మరియు కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలు మరియు వీడియోలను పంచుకుంటారు.