Shukra Vakri 2025: హోలీకి ముందు.. నవగ్రహాల్లో సంపదను ఇచ్చే శుక్రుడు తిరోగమనంలోకి వెళ్లనున్నారు. దీంతో ఈ మూడు రాశుల వారికి అపారమైన డబ్బుతో పాటు కీర్తి ప్రతిష్టలను అందుకుంటారు.
త్వరలో శుక్ర గ్రహం మీన రాశిలో తిరోగమనంలో రాబోతుంది. ఇది 3 రాశుల వారిపై సానుకూల ప్రభావాన్ని చూపనుంది. ఈ యేడాది హోలీ పండుగ మార్చి 14న రాబోతుంది. కానీ దానికి కొన్ని రోజుల ముందు మార్చి 2 శుక్ర గ్రహం తన వక్ర గమనంలో ప్రయాణించనుంది.
శుక్ర గ్రహం కదలికలో మార్పుతో పాటు అది తిరోగమనంలో కదులుతుంది. శుక్ర గ్రహం యొక్క కదలిక దాని ఉచ్ఛ రాశి అయిన మీనంలో తిరోగమనంలో ఉండబోతోంది. అటువంటి పరిస్థితిలో, కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉండబోతున్నట్టు సమాచారం.
మీనరాశిలో శుక్రుని గమనంలో మార్పు, తిరోగమన గమనం మూడు రాశులపై సానుకూల ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ సమయంలో, ఈ రాశుల వారి సంపదలో భారీ పెరుగుదల ఉండబోతుంది. అంతేకాదు మీ తెలివితేటలు వల్ల జీవితంలో పురోగతి ఉండబోతుంది.
కర్కాటక రాశి.. కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు శుక్రుని తిరోగమన కదలిక కారణంగా ప్రత్యేక ప్రయోజనాలను అందుకుంటారు. ఈ కాలంలో ఆ వ్యక్తి అదృష్టం కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో మతపరమైన కార్యకలాపాలపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడే అవకాశాలున్నాయి. ఈ సమయం మీకు ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉండబోతుంది.
ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి శుక్రుడి తిరోగమనం ధనుస్సు రాశివారికి శుభకాలం అని చెప్పొచ్చు. ఈ సమయంలో భౌతిక సుఖాలు అందుకుంటారు. అంతేకాదు ఉద్యోగం కోసం చూస్తున్న వారికి శుభవార్త అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి అందుకుంటారు.
వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి ఈ సమయం బంగారం మయం అని చెప్పాలి. ఈ సమయంలో ఈ రాశి వారిలో సృజనాత్మక, ఆధ్యాత్మిక రంగాల వైపు విజయం సాధిస్తారు. ఈ కాలంలో ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్ అందుకుంటారు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి.
మీన రాశి.. శుక్రుడి వక్ర గమనం వలన మీన రాశి వారికి అతిపెద్ద ప్రయోజనాలు అందుకుంటారు. వ్యక్తి జీవతంలో ఆర్ధికంగా మెరుగుదల ఉంటుంది. ఫ్యామిలీ లైఫ్ లో ఆనందం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో సానుకూల ఫలితాలను అందుకుంటారు. అంతేకాదు మానసిక ప్రశాంతత పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు అందుకుంటారు. కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి. వివాహాం కానీ వారికి ఈ సయమంలో అనుకూలంగా ఉండబోతుంది.
గమనిక: ఈ కథనం మతపరమైన, జ్యోతిష్యులు, పండితులు, అంతర్జాలంలో ఇచ్చిన వార్తలను సమాచారాన్ని మా ప్రేక్షక దేవుళ్లకు అందించాము. జీ న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.