Shani Dev Gochar 2025: మహా శివరాత్రి తర్వాత శని దేవుడు తన రాశి మార్చుకోబోతున్నారు. అవును ప్రస్తుతం శనీశ్వరుడు కుంభ రాశిలో సంచరిస్తున్నారు. త్వరలో మహా శివరాత్రి వరకు మీన రాశిలోకి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉండబోతుందో చూద్దాం..
Shani Dev Gochar 2025: నవగ్రహాల్లో శని దేవుడు న్యాయానికి కర్మలకు అధిపతి. శనీశ్వరుడు త్వరలో కుంభం నుంచి మీన రాశిలోకి రాబోతున్నారు. శని రాశి మార్పు వల్ల ఏ రాశులకు చెందిన వ్యక్తులకు బిగ్ రిలీఫ్ దగ్గబోతుంది. తెలుసుకోండి...
జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఏదైనా గ్రహం యొక్క అస్తమయం ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంటుంది. శనిదేవుడు నవ గ్రహాల్లో నెమ్మదిగా సంచరించే గ్రహం. ప్రస్తుతం శనిదేవుడు తన స్వంత రాశి అయిన కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో తన రాశిలో అస్తమించబోతున్నాడు.
దీని అర్థం ఒక గ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా కదులుతుంటే, ఆ గ్రహం సూర్యుడి వెలుగులో అసలు కనిపించవు. ప్రతి యేడాది కొన్ని రోజులు, కొన్ని గ్రహాలు ఆకాశంలో సూర్యుడితో కలవడం వలన అస్తమిస్తుంటాయి. ఆ సమయంలో ఆయా గ్రహాలు అంతగా గోచరించవు. అందువల్ల, శని అస్తమించడానికి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వబడింది.
గ్రహ మండలంలో శనిదేవుడు చాలా శక్తివంతమైన గ్రహం. ఆ గ్రహ అస్తమయం కొన్ని రాశుల వారికి అదృష్టాన్నితీసుకురాబోతుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని గ్రహం మహా శివరాత్రికి అస్తమించబోతుంది. ఈ స్థితి ఏప్రిల్ 8 వరకు ఉండబోతుంది. ఈ శని సంచారము వలన ఏ మూడు రాశులకు అత్యంత శుభ ఫలితాలు కలుగుతుందో చూద్దాం..
కర్కాటక రాశి.. కుంభ రాశిలో శని దేవుడి అస్తమయం వలన ఈ రాశుల వారికి విదేశీయాన యోగం ఉండబోతుంది. ఈ సమయంలో వ్యక్తులు తమ కెరీర్‌లో ఉన్నత అవకాశాలను పొందుతారు. వీళ్ల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనిచేస్తే వ్యక్తుల నుంచి పూర్తి మద్ధతు పొందుతారు. వృత్తిపరమైన వీళ్ల కృషికి ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మీ గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో వీళ్ల ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితం ఆనందంగా ఉండబోతుంది. అంతేకాదు జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.
మకర రాశి.. ఈ కాలంలో మకర రాశి త్వరలో శనిదేవుడు ఏల్నాటి శనిదేవడి ప్రభావం నుంచి బయట పడతారు. ఈ కాలంలో ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడటంతో ఆనందం వెల్లివిరుస్తుంది. అంతేకాదు ఈ సమయంలో ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా లాభాలతో పాటు, మీరు మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా ఉపశమనం పొందుతారు. అంతేకాదు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలిగిపోతాయి. కొత్త ఉద్యోగులకు ఇదే మంచి తరుణం. ఎక్కువ లాభం పొందవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది.
వృశ్చిక రాశి.. శనిదేవుడు అస్తమయం వలన వృశ్చి క రాశి వారికి మంచి అనుకూలమైన సమయం. శని కుంభ రాశిలో అస్తమయం తర్వాత మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ కాలంలో గత కొన్నేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు పటాపంచలవుతాయి. కుటుంబ జీవితంలో సంతోషం, శ్రేయస్సు వెల్లివిరుస్తాయి. మీరు మీ జీవితంలో పెద్ద మార్పులను అనుభవించే అవకాశం ఉందన్నారు. ఈ రాశి వారికి శనిదేవుడి గ్రహ స్థితి చాలా అనుకూలంగా ఉండబోతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా గణనీయమైన ప్రయోజనాలను అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు జీతంలో పెరుగుదల ఉంటుంది. అంతేకాదు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. మీరు సని చేసే ప్రతి రంగంలోనూ విజయాన్ని అందుకుంటారు.
గమనిక: ఈ కథనం మతపరమైన, జ్యోతిష్యులు, పండితులు, నెట్ లో ఇచ్చిన సమాచారాన్ని మా ప్రేక్షక దేవుళ్లకు అందించాము. జీ న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించడం లేదు.