Kavya Maran In IPL: కావ్య పాపకు కోట్ల ఆస్తి.. ఈ మిస్టరీ గర్ల్ గురించి ఆశ్చర్యపోయే విషయాలు ఇవే..!

SRH Owner Kaviya Maran: ఐపీఎల్‌తో బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ప్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి స్టాండ్స్‌లో కూర్చొని జట్టును ఉత్సాహపరుస్తోంది. కావ్య భావోద్వేగాలు కూడా క్రికెట్ అభిమానులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.
 

1 /5

కావ్య మారన్ వ్యక్తిగత జీవితం పూర్తిగా గోప్యంగా ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఆమె ఉండరు. ఆమె రిలేషన్‌షిప్ స్టేటస్‌పై ఎలాంటి అప్‌డేట్ లేదు.  

2 /5

సన్ టీవీ గ్రూప్ ఛైర్మన్, వ్యవస్థాపకుడు కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్. డీఎంకే పార్టీ మాజీ కేంద్ర మంత్రి మురసోలి మారన్ మనవరాలు.   

3 /5

2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా కావ్య నియమితులయ్యారు. అప్పుడే క్రికెట్‌తో తన ప్రయణాన్ని మొదలుపెట్టారు.   

4 /5

31 ఏళ్ల కావ్య చెన్నైలోని స్టెల్లా మేరీస్ కాలేజీలో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. యూకేలో వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. కావ్య ఆస్తి విలువ సుమారు రూ.409 కోట్లు ఉంటుంది.   

5 /5

ఐపీఎల్ వేలంలో మొదటిసారి కనిపించిన కావ్య మారన్.. చాలా సులభంగా క్రికెట్ అభిమానులను ఆకర్షించారు. కావ్య అందమైన లుక్స్‌తో క్రికెట్ అభిమానులను ఆకర్షిస్తున్నారు. స్టేడియంలో కెమెరామెన్ కూడా కావ్యపైనే స్పెషల్ ఫోకస్ పెడుతుంటారు.