Vettaiyan OTT Streaming: సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘వేట్టయ్యన్’. టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చినా.. అందుకు తగ్గ వసూళ్లను రాబట్టలేకపోయింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ గతేడాది ‘జైలర్’మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి బ్లాక్ బస్టర్ విజయాన్నే నమోదు చేసింది. రజినీకాంత్ తన ఏజ్ కు తగ్గ పాత్రలో నటించి మెప్పించాడు.
తప్పు చేస్తే కుమారుడైన చంపే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజినీకాంత్ యాక్టింగ్ కు అందరు ఫిదా అయ్యారు. ‘జైలర్’ తర్వాత తన కూతురు ఐశ్వర్య దర్శకత్వ్ంలో తెరకెక్కిన ‘లాల్ సలాం’ మూవీ రజినీకాంత్ ఇమేజ్ పై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది. ఈ సినిమాకు కనీస ఓపెనింగ్స్ దక్కలేదు.
అంతేకాదు తెలుగులో నెగిటివ్ షేర్ అందుకున్న సినిమాగా రజినీకాంత్ కెరీర్ లో మాయని మచ్చగా నిలిచింది. తాజాగా ‘జై భీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ రాజా దర్శకత్వంలో ‘వేట్టయ్యన్’ మూవీతో పలకరించాడు. ఈ సినిమాలో దుర్మార్గులైన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ను ఎన్ కౌంటర్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయాడు.
ఫస్ట్ హాఫ్ వరకు బాగున్నా.. ఈ చిత్రం సెకండాఫ్ ను ఇంకాస్త పకడ్బందీగా తెరకెక్కిస్తే బాగుండేదనే కామెంట్స్ వినబడ్డాయి. పైగా తెలుగులో ఈ సినిమా టికెట్ రేట్స్ తగ్గించినా.. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 11 కోట్ల షేర్ (రూ. 21 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.
ఓవరాల్ గా రూ. 17 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ తో రంగంలోకి దిగిన ‘వేట్టయ్యన్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 7 కోట్లు రాబట్టాల్సి ఉంది. ఓవరాల్ గా తెలుగులో యావరేజ్ గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 122 కోట్ల షేర్ (రూ.250 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. దాదాపు 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మరో రూ. 40 కోట్ల షేర్ రాబట్టాలి.
ఇపుడున్న పరిస్థితుల్లో ఈ రేంజ్ వసూళ్లను రాబట్టడం కష్టమే అని చెప్పాలి. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 7 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. దీనిపై త్వరలో అఫీషియల్ గా ప్రకటన వెలుబడాల్సి ఉంది.