Telangana Weather Update: మొన్నటి వరకు చలి చంపేసింది. ఇక ఎండాకాలం వంతు. నేటి నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నేటి నుంచి పొడి వాతావరణం ఏర్పడనుంది.
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల ఎక్కువగా ఈరోజు నుంచి నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న, మొన్నటి వరకు చలి తీవ్రత పెరగడం, పొగ మంచు కమ్మేయడం జరిగింది.
ఇప్పుడు ఎండ తీవ్రత పెరగనుంది. ఫిబ్రవరి నెల కూడా కావడంతో ఎండ తీవ్రత పెరగనుంది. ఈనెల 28వ తేదీ మహాశివరాత్రి తర్వాత ఎండ కాలం ప్రారంభం అవుతుంది. అయితే, ముందుగానే మధ్యాహ్నం ఎండ తీవ్రత కూడా పెరుగుతోంది.
కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం నేటి నుంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో భానుడి ప్రతాపం మొదలు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
చలికాలం పూర్తయిందా? అనేలోగా ఎండకాలం కూడా మొదలైపోయింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం పొడి వాతావరణం, ఉక్కపోత తప్పదు. భానుడి భగభగలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది.
అయితే, ఈ సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు వెళ్లకుండా ఉండటమే మంచిదని హైదరాబాద్ వాతావరణ శాఖ సూచించింది. అయితే, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మూడు రోజులు చలి తీవ్రత అలాగే ఉంటుందని చెప్పింది.