Pending DA: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతం కంటే ప్రభుత్వం అందించే డీఏలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ విషయంలో వివిధ రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఇచ్చే డీఏల విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా ఎప్పటికపుడు క్లియర్ చేస్తుంటాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ (DA)ల్లో చాలా మటుకు పెండింగ్ లో పెట్టాయి. ఇప్పటి వరకు ఎన్ని డీఏలు ఉద్యోగులకు బాకీ ఉన్నారంటే..
తెలంగాణ కంటే పక్కనే ఉన్న తమిళనాడుతో పాటు చిన్న రాష్ట్రాలు, ఆదాయ వనరులు పెద్దగా లేని ఒడిషా, సిక్కిం, హర్యానా వంటి రాష్ట్రాలు తమ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ (Dearness Allowence)లను ఎప్పటి కప్పుడు క్లియర్ చేస్తున్నాయి. ఈ రాష్ట్రాలు ఒక్క డీఏ కూడా పెండింగ్ లో లేకపోవడం విశేషం.
అటు పక్కనే ఉన్న కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఒక డీఏ (DA) మాత్రమే బాకీ ఉన్నాయి.
అప్పుల్లో కూరుకుపోయిన మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ తమ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాల్సి ఉంది. అటు ఎన్టీయే పాలిత మరో రాష్ట్రమైన బిహార్ లో కూడా ఉద్యోగులకు రెండు డీఏలు బాకీ ఉన్నాయి.
ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయాలో ప్రభుత్వం తమ ఉద్యోగులకు మూడు DA లు బాకీ ఉన్నాయి. త్వరలో వాటిని క్లియర్ చేయనున్నాయి. అటు అప్పుల కుప్పగా మారిన మరో కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఇంత సంక్లిష్ట స్థితిలో కూడా ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలో ఒకటే పెండింగ్ లో ఉంది.
కానీ తెలంగాణలో మాత్రం మన దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పాండిచ్చేరిలతో పోలిస్తే.. ఐదు డీఏలు పెండింగ్ లో ఉన్నాయి.
ఈ సారి ఉద్యోగులు ప్రభుత్వం ఒకేసారి తమకు 3 డీఏలు చెల్లిస్తుందని అనుకున్నారు. తీరా ఒక డీఏ మాత్రమే క్లియర్ చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మొత్తంగా బేసిక్ శాలరీ ప్రకారం ఉద్యోగులకు డీఏ చెల్లింపులు జరగనున్నాయి.