Shwetha Basu Prasad: ఆరడుగులు ఉంటారు.. చాలా వేధించాడు.. బాడీ శేమింగ్ చేసేవాడు.. తెలుగు స్టార్ హీరో గురించి శ్వేతా బసు షాకింగ్ కామెంట్స్

Telugu Star Hero : శ్వేతా బసు.. తెలుగు చిత్రపరిశ్రమలో తను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఈ మధ్యన పంచుకున్నారు. ఆమె 5 అడుగులు 2 అంగుళాలు హైట్ మాత్రమే ఉందటం వల్ల.. ఒక తెలుగు హీరో తనని వేధించారని.. ఈ విషయంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, కొన్ని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. 

1 /5

యంగ్ హీరోయిన్ శ్వేతా బసు తెలుగు సినిమాల్లో మెరుపులా మెరిసి ఆ తరవాత కనుమరుగయిపోయింది. ఒకప్పుడు తెలుగులో సీనియర్ హీరోలు, ప్రముఖ దర్శకులతో చాలా సినిమాల్లో నటించింది. ఆమె కెరీర్‌లో కొత్త బంగారు లోకం వంటి బిగ్గెస్ట్ హిట్స్ ఉండగా, రైడ్ వంటి సక్సెస్ ఫుల్ చిత్రంలో కూడా నటించింది. 

2 /5

అయితే ఆ తర్వాత మాత్రం పెద్దగా చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. అంతేకాకుండా ఆ మధ్యలో కొన్ని కాంట్రవర్సీల్లో కూడా ఇరుక్కుంది ఈ హీరోయిన్. ఇక ఈమధ్య.. పెళ్లి చేసినప్పటికీ ఆ బంధం నిలబడలేదు. ఏడాదికి భర్తతో విడిపోయింది. అయితే, ఈ క్రమంలో శ్వేతా తన కెరీర్ గురించి కొన్ని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. 

3 /5

టాలీవుడ్‌లో తన కెరీర్ అత్యధికంగా సాఫీగా సాగినప్పటికీ, ఒక సందర్భంలో ఆమెకు వేధింపులు ఎదురయ్యాయని పేర్కొంది. ఒక తెలుగు హీరోతో పనిచేస్తున్నప్పుడు, తాను బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్నానని చెప్పకు వచ్చింది. "నేను 5 అడుగులు 2 అంగుళాలు ఎత్తు కలిగి ఉండగా, ఆ హీరో సుమారు 6 అడుగులు ఉంటారు. సెట్స్‌లో చాలా సార్లు నా ఎత్తు గురించి వ్యాఖ్యలు చేయడం లాంటిది చేశాడు. అంతేకాకుండా నన్ను చాలా వేధించాడు," అని శ్వేతా పేర్కొంది. “నా హైట్ విషయంలో నా చేతుల్లో ఏమీ లేదు. అయినప్పటికీ, నా ఎత్తు గురించి ఎగతాళి చేస్తే, అది బాధగా అనిపించింది," అని ఆమె తెలిపారు.

4 /5

అంతేకాకుండా, ఆ హీరో గురించి శ్వేతా చెబుతూ, "ఆ హీరో తెలుగు మాట్లాడటం కూడా సరిగ్గా రాదు. ఒకేసారి ఒకే సన్నివేశం పై పలు టేకులు తీసేవాడు. కానీ నేను తెలుగు నటి కాకపోయినా, నేను డైలాగులు బాగా నేర్చుకుని చెప్పేదాన్ని." అని చెప్పుకొచ్చింది.

5 /5

ఈ క్రమంలో ఈ హీరో ఎవరో అని.. శ్వేతా బసు తెలుగులో నటించిన చిత్రాలు అన్నీ కూడా తెగ వెతికేస్తున్నారు ప్రేక్షకులు.