Rajamouli: రాజమౌళిని సైతం డామినేట్ చేసిన తెలుగు హీరో.. ప్రభాస్ కాదు!

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి సినిమాలు ప్రత్యేకమైన గుర్తింపు పొందాయి. ముఖ్యంగా రాజమౌళి వల్లే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి వారు పాన్ ఇండియా స్టేటస్ సంపాదించుకున్నారు. అయితే ఈ ముగ్గురు కాకుండా మరో హీరో.. ఏకంగా రాజమౌళినే ప్రపంచం మొత్తం డామినేట్ చేస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరో ఒకసారి చూద్దాం..

1 /5

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాలు తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా హిట్‌ అవుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాలతో ఆయన తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే, అందరూ ఊహించని విధంగా ఒక హీరో రాజమౌళినే తన నటనతో డామినేట్ చేశాడు. ఆ హీరో మరెవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ.  

2 /5

రవితేజ, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన విక్రమార్కుడు సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. సాధారణంగా, రాజమౌళి సినిమాల్లో దర్శకుడి కంటే ఎక్కువగా కథ, విజువల్స్, గ్రాండియర్ హైలైట్ అవుతాయి. అయితే విక్రమార్కుడు.. చిత్రంలో మాత్రం హీరో నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది.  

3 /5

ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ పోషించారు. విక్రమ్ సింగ్ రాథోడ్ అనే ధైర్యవంతమైన పోలీస్ ఆఫీసర్, అత్తిలి సత్తిబాబు అనే దొంగ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా రవితేజ యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ, ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.    

4 /5

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. మణిశర్మ అందించిన సంగీతం, విజయేంద్ర ప్రసాద్ రాసిన కథ సినిమాకు అదనపు బలం అయ్యాయి. 2006లో విడుదలైన ఈ చిత్రం ₹18.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది, కానీ దాదాపు ₹25 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేశారు. కానీ రవితేజ తరహా ఎనర్జీతో, నటనతో, బాడీ లాంగ్వేజ్‌తో మరెవ్వరూ ఈ పాత్రను న్యాయం చేయలేకపోయారని, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సైతం ఈ విషయాన్ని.. ఒక సందర్భంలో చెప్పారు.

5 /5

సాధారణంగా తెలుగులో హిట్ అయిన సినిమాలు ఉత్తరాదిలో పెద్దగా గుర్తింపు పొందవు. కానీ విక్రమార్కుడు సినిమా హిందీలోకి డబ్ చేయడంతో రవితేజ నటనకు ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఆయన డైలాగ్ డెలివరీ, యాక్షన్, కామెడీ టైమింగ్ ఉత్తరాదిలోనూ విపరీతంగా ప్రాచుర్యం పొందాయి.  రాజమౌళి వంటి దర్శకుడి సినిమాల్లో కథ, టెక్నికల్ అద్భుతాలు మెయిన్ హైలైట్ అవుతాయి. కానీ విక్రమార్కుడు సినిమాలో మాత్రం రవితేజ నటనే ప్రధానంగా నిలిచింది. ఇది ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయి అయ్యింది. ఇప్పటికీ ఈ సినిమా రీటెలికాస్ట్ అవుతున్నా ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తున్నారు.