Salt Water Benefits: ఉప్పు లేనిదే ఏ కూర రుచించదు. ఉప్పు అతిగా కూడా తినకూడదు. అయితే, ఉదయం కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఉప్పు నీరు ఎలక్ట్రోలైట్‌లా పనిచేస్తుంది. ఉదయం ఉప్పునీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
ఉప్పునీటిలో పొటాషియం, క్లోరైడ్, సోడియం ఉంటుంది. ఇది మన శరీరానికి హైడ్రేషన్ అందిస్తుంది. ఉప్పు నీరు తీసుకోవడం వల్ల నరాల పనితీరు కూడా మెరుగవుతుంది. వర్కౌట్లు చేసేవారికి చెమట బయటకు పోతుంది. అలాంటివారు ఉప్పు నీరు తీసుకోవాలి.
ఉప్పునీటిలో ఉండే ఖనిజాలు చర్మంపై ఉండే ఎక్జీమా, సోరియాసిస్ తగ్గిస్తుంది. జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తికి ఉప్పునీరు తోడ్పడుతుంది. ఇందులోని హైడ్రోక్లోరిక్ యాసిడ్ జీర్ణసమస్యలను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక మలబద్ధకానికి ఎఫెక్టీవ్ రెమిడీ.
అంతేకాదు ఉప్పునీటితో పుక్కిలించడం వల్ల గొంతునొప్పి తగ్గిపోతుంది. శ్వాసకోశ సమస్యలు దరిచేరకుండా కాపాడుతుంది. ఇందులోని డైరుటిక్ గుణాలు యూరిన్ ఉత్పత్తిని పెంచి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించేస్తుంది.
హైబీపీతో బాధపడేవారు ఉప్పునీటిని తీసుకోకూడదు. వీరు ముందుగా వైద్యులను సంప్రదించాలి. అతిగా ఉప్పు నీరు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. అంతేకాదు ఇది డీహైడ్రేషన్‌కు గురయ్యేలా చేస్తాయి.
కడుపులో జీర్ణ సమస్యలను కూడా పెంచుతుంది. కడుపులో గ్యాస్, డయేరియా అతిగా ఉప్పునీరు తీసుకోవడం వల్ల కలుగుతుంది. ఉప్పు నీటిని మీ డైట్లో చేర్చుకున్నప్పుడు ముందుగా వైద్యులను సంప్రదించండి. దీని వల్ల ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవు.