Parenting Tips For Parents: పిల్లలు ఎదుగుతున్న క్రమంలో కొన్ని సార్లు పెద్దలు చెప్పిన మాటలు వినకుండా ఉంటారు. అంతేకాకుండా మొండికేస్తూ, అల్లరి చేస్తుంటారు. అయితే సమయంలో తల్లిదండ్రులు వారిపై శ్రద్థ వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా పిల్లలు మీ మాట వినాలంటే ఈ పనులు చేస్తే వారు దారిలోకి వస్తారు.
పిల్లలు మీ మాటలను వినాలి అంటే ముందుగా మీరు వారి కోసం సమయం కేటాయించాలి. పిల్లలు మీతో కాలసి సమయం గడిపే విధంగా మీరు మీ టైమ్‌ను కేటాయించాలి. కొందరు తల్లిదండ్రులు పిల్లల భావోద్వేగాలను పట్టించుకోకపోతే తీవ్రమైన సమస్యల బారిన పడారు. కాబట్టి మీరు పిల్లల కోసం సమయం కేటాయించండి.
పిల్లలతో పేరెంట్స్ చాలా సున్నితంగా ఉండాలి. వారిపైన చిరాకు, కోపం వంటి పడకుండా ఉండాలి. ముఖ్యంగా పిల్లలకు మాట ఇచ్చి తప్పకుండా ఉండేలా చేసుకోండి. పిల్లలను ఏదో సాకుతో దగ్గరకు రానీయకుండా చేయడం వంటివి చేయకండి.
చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండరు. దీని వల్ల పిల్లలు ఏదైన చెప్పాలి అంటే భయపడుతుంటారు. కాబట్టి మీరు మీ పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి.
పిల్లలపైన ఎక్కువగా అరవొద్దు. వారిపైన కొట్టడం, అరవడం చేస్తే పిల్లలు ఇంకా మొండిగా తయారవుతారు. వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్ననం చేయండి.
చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను ఇతర పిల్లలతో పోల్చుతుంటారు. దీని వల్ల నెగటివ్‌గా ఎఫెక్ట్ కలుగుతుంది. మీ పిల్లల్లో ఉన్న ప్రత్యేక లక్షణాలను గుర్తించి వారికి తోడ్పాటు అందించండి.