Tirumala Tirupati Devasthanam: తిరుమల శ్రీ వేంకటేశుని దర్శనానికి నిత్యం వేలమంది క్యూ కాంప్లెక్స్‌లలో రద్దీగా నిండిపోయి ఉంటుంది. సర్వదర్శనంతో పాటు ప్రత్యేక దర్శనం టోకెన్లతో స్వామివారి దర్శనానికి ఎదురుచూస్తూ ఉంటారు.. దేశవ్యాప్తంగా శ్రీవారి దర్శనానికై వేల సంఖ్యలో తిరుమల చేరుకుంటారు. అయితే స్వామివారి దర్శనానికి ప్రస్తుతం 15 గంటల సమయం పడుతుంది. తిరుమలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇదే..
తిరుమల వెళ్లే భక్తులకు అలెర్ట్ శ్రీవారి దర్శనానికి దాదాపు 15 గంటల సమయం పడుతుందని తెలిసింది. తిరుమల టికెట్లు లేని భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఇంత సమయం పడుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి క్యూ కాంప్లెక్స్ లలో భక్తులు వేచి ఉంటారు. ప్రత్యేక దర్శనం టోకెన్లతో పాటు ఉచిత దర్శనం భక్తులు కూడా స్వామివారి దర్శనానికి బారులు తీరి ఉంటారు.
మూడు నెలలు ముందుగానే ప్రత్యేక దర్శనం టోకెన్లు జారీ చేస్తారు. ఇది కాకుండా ఉచిత దర్శనం భక్తులు కూడా వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లలో స్వామివారి దర్శనానికై ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం స్వామివారి దర్శనానికి ఉచిత దర్శనం భక్తులకు 15 గంటల సమయం పడుతుంది. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
నిన్న ఒక్కరోజు స్వామి వారి దర్శనానికి 84,000 మంది పైగా వచ్చారు. ఇందులో 25 వేల మంది పైగా స్వామివారికి తలనీలాలు సమర్పించారు.. ఇక హుండీ ఆదాయం రూ. 3.5 కోట్లకు పైగా నిన్న ఒక్కరోజే వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అయితే తాజాగా భక్తులకు తిరుమల టిటిడి మరో తీపి కబురు అందించింది.
ఏపీలోని నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీకి చెందిన వీఐపీ బ్రేక్ దర్శన కోటాను డబుల్ చేస్తున్నట్లు ప్రకటించింది. విఐపి బ్రేక్ దర్శనం 50 నుంచి 100కు పెంచుతున్నట్లు టీటీడీ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.. దీంతో స్వామివారి భక్తులు సంతోష పడుతున్నారు అయితే వీరికి ఆధార్ కార్డు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది టీటీడీ.
టీటీడీ అన్యమతస్తులను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేలా చర్యలు చేపట్టిన సంగతి కూడా తెలిసిందే. ఈ విధంగా కొంత మంది ఉద్యోగులను బదిలీ చేయించింది. మరోవైపు తిరుమల లడ్డు వివాదంలో కూడా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. లడ్డు వివాదంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సీట్ బృందం తిరుపతిలోనే ఉంటూ దర్యాప్తు చేస్తున్నారు.