Tirumala: టీటీడీ సంచలన ప్రకటన.. ఆరోజున వాళ్లు శ్రీవారి దర్శనానికి రావొద్దంటూ స్పెషల్ రిక్వెస్ట్.. కారణం ఏంటంటే..?

TTd News: టీటీడీ శ్రీవారి భక్తులకు కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఈనెల 12వ తేదీన  శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.

1 /6

తిరుమలకు ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. శ్రీవారిని పిలిస్తే పలికే దైవంగా భావిస్తారు. చాలా మంది కిలో మీటర్ల మేర క్యూలైన్లలో స్వామి వారి కోసం వేచి చూస్తుంటారు. స్వామివారిని ఒక్కసారి చూసే భాగ్యం కోసం ఎన్ని వ్యయప్రయాసాలకైన వెనుకాడరు.  

2 /6

 ఏపీలో అధికారంలోకి వచ్చి కూటమి సర్కారు తిరుమలకు పూర్వవైభవం దిశగా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు కల్గకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. టీటీడీకి నూతన చైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు తీసుకున్నాక టీటీడీ లో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు.  

3 /6

ఇటీవల తిరుమలలో వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో తొక్కిసలాట జరిగినప్పటి నుంచి అధికారులు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. తిరుమలలో రద్దీగా ఉన్న ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకుంటున్నారు.  ఇదిలా ఉండగా.. ఈ నెల 12వ తేదీన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఉత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

4 /6

దీనిపై టీటీడీ ఇటీవల సమావేశమయ్యారు. టీటీడీ విజిలెన్స్, పోలీసులతో సమావేశం అయ్యారు.  తిరుమలకు వచ్చే భక్తులకు తాగునీరు, అన్న ప్రసాదం, వైద్యం, వసతీ, ఇతర సదుపాయాల్లో ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.  

5 /6

తిరుమలలో ఫిబ్రవరి 12వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమల గోకులం సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన తీర్థ ఉత్సవాలలో రామకృష్ణతీర్థ ముక్కోటి ఉత్సవాలకు ఎంతో ప్రాధన్యత ఉంది.

6 /6

ఈ ఉత్సవాలకు.. ముఖ్యంగా చిన్నపిల్లలు, గుండె జబ్బులున్నవారు, అధికబరువు, ఆస్తమాలు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్న వారు.. ఈ ఒక్కరోజు తమ దర్శనంను మరో రోజుకు వాయిదా వేసుకొవాలని టీటీడీ భక్తుల్ని కోరింది. ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు తరలి వస్తుంటారు. ముందు జాగ్రత్తగా ఈ సమస్యలతో బాధపడేవారు తిరుమలకు ఫిబ్రవరి 12న కాకుండా.. మరో రోజు తమ దర్శనం ప్లాన్ చేసుకొవాలి టీటీడీ భక్తులకు అప్పీల్ చేసింది.