Top 5 Indian Cricketers Failed In Yo-Yo Test: టీమిండియాలోకి ఎంపికైన ఆటగాళ్ల ఫిట్‌నెస్ లెవల్‌ను నిర్ధారించడానికి బీసీసీఐ యో-యో టెస్టులను నిర్వహిస్తోంది. ఈ టెస్టులో ఫెయిల్ అయిన ఆటగాళ్లను టీమ్ నుంచి కూడా తొలగిస్తుంది బీసీసీఐ. విరాట్ కోహ్లి కెప్టెన్సీలో యో-యో టెస్టులు ప్రారంభమయ్యాయి. జాతీయ జట్టుకు ఆడాలంటే తప్పనిసరిగా క్లియర్ చేయాల్సిందే. ఇప్పటివరకు యో-యో టెస్టులో విఫలమై జట్టులో స్థానం కోల్పోయిన ఐదుగురు క్రికెటర్లపై ఓ లుక్కేయండి.
ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ 2017లో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం జట్టు ఎంచుకోవడానికి ముందు యో-యో టెస్ట్‌లో విఫలమయ్యాడు. జట్టులో చోటు సంపాదించే ఛాన్స్ మిస్ అయ్యాడు. తరువాత ఫిట్‌నెస్‌పై తీవ్రంగా శ్రమించి.. స్వదేశంలో శ్రీలంక సిరీస్ ఆడేందుకు తిరిగి వచ్చాడు.
యో-యో టెస్టులో విఫలమై పేసర్ మహ్మద్ షమీ కూడా ఓసారి జట్టులో చోటు కోల్పోయాడు. స్థానంలో చివరి నిమిషంలో నవదీప్ సైనీని జట్టులో చేర్చారు. ఒక నెల తరువాత షమీ యో-యో టెస్టులో పాస్ అయ్యాడు.
2017లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌కు ముందు యువరాజ్ సింగ్ ఆశ్చర్యకరంగా జట్టులో చోటు కోల్పోయాడు. అప్పట్లో కారణం స్పష్టంగా వెల్లడించలేదు. యో-యో టెస్ట్‌లో యువరాజ్ విఫలమయ్యాడని తరువాత తేలింది. చివరకు పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు యువరాజ్ తీవ్రంగా శ్రమించాడు.
2018లో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఎ జట్టును ప్రకటించినప్పుడు సంజూ శాంసన్ అందులో భాగమయ్యాడు. అయితే యో-యో టెస్టులో శాంసన్ విఫలం కావడంతో డ్రాప్ అయ్యాడు. శాంసన్ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టుతో చేరాడు. శాంసన్ ఒక నెల తర్వాత యో-యో టెస్టులో క్లియర్ అయ్యాడు. ఇండియా A జట్టులోకి తిరిగి వచ్చాడు. ఒక సంవత్సరం తర్వాత సీనియర్ జట్టు తరుఫున కూడా ఆడాడు.
ఐపీఎల్ 2018లో అద్భుత ప్రదర్శనతో అంబటి రాయుడుకు టీమిండియా నుంచి పిలుపువచ్చింది. కానీ యో-యో టెస్ట్‌లో ప్రమాణాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. రాయుడు స్థానంలో చివరికి సురేష్ రైనా జట్టులోకి వచ్చాడు. తరువాత యో-యో టెస్ట్ క్లియర్ చేసిన రాయుడు.. 2018 ఆసియా కప్‌కు జట్టులో స్థానం సంపాదించాడు.