Trisha: త్రిషకి మేజర్ ఆపరేషన్..కోలుకోవడానికి 30 రోజులు..!

Trisha health : త్రిష సర్జరీ చేయించుకుంటుందనే వార్తలు తమిళ్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 20 ఏళ్లకు పైగా సినీ కెరీర్‌లో కొనసాగుతున్న త్రిష, ఇప్పటికీ బిజీగా సినిమాలు చేస్తోంది. అయితే, ఆమెకి సర్జరీ జరిగిందని..ఆల సర్జరీ అనంతరం 30 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారని..వార్త ఒకటి తెగ వినిపిస్తోంది. కానీ ఈ విషయంపై త్రిష నుంచి అధికారిక స్పందన రాలేదు. 
 

1 /5

బాలీవుడ్‌, టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాన్ని మెరుగుపర్చుకోవడానికి.. చిన్న చిన్న సర్జరీలు చేయించుకోవడం సాధారణం. హీరోలు కూడా కొన్నిసార్లు ఈ ప్రక్రియకు లోనవుతుంటారు. కానీ కొన్ని సర్జరీలు వికటించి, కెరీర్‌పై ప్రభావం చూపిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం మరోసారి చర్చకు రావడానికి కారణం స్టార్ హీరోయిన్ త్రిష. తమిళ మీడియాలో త్రిష లిప్స్ సర్జరీ చేయించుకోనుందనే వార్తలు వెలువడుతున్నాయి.  

2 /5

త్రిష కెరీర్ ఆరంభం నుంచి ఆమె లిప్స్ గురించి ట్రోలింగ్ ఎదుర్కొంటూనే ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు చేయడం వల్ల ఆమె ఈ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. 20 ఏళ్లకు పైగా సినీ రంగంలో కొనసాగుతున్న త్రిష..ఇప్పటివరకు తన సహజ సౌందర్యాన్ని కాపాడుకుంది. కానీ విమర్శలు ఇంకా ఆగకపోవడంతో ఇప్పుడు సర్జరీ చేయించుకోవాలనుకుంటుందా? అనే ప్రశ్న ఆమె అభిమానులను ఆలోచనలో పడేస్తోంది.  

3 /5

తమిళ్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం, త్రిష త్వరలోనే చిన్న లిప్ సర్జరీ చేయించుకోనుందట. ఈ ప్రక్రియ పూర్తవడానికి 20-30 రోజులు అవసరమని, త్రిష త్వరగా కోలుకొని షూటింగ్‌కి హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. కానీ ఇప్పటి వరకు త్రిష ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.  

4 /5

త్రిష సహజ సౌందర్యంతోనే చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె లిప్స్ సర్జరీ చేయించుకోవడం వల్ల ఆకర్షణ తగ్గే ప్రమాదం ఉందని కొందరు భావిస్తున్నారు. అంతే కాకుండా, సర్జరీ కారణంగా అనవసర అనారోగ్య సమస్యలు వస్తాయేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ వార్తలు కేవలం పుకార్లేనని, త్రిష అసలు అలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంతో మంది ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.  మరి త్రిష లిప్స్ సర్జరీ వార్తలు నిజమేనా, కేవలం పుకార్లేనా అన్నది తెలియాలి అంటే..ఆమె అధికారిక ప్రకటన ఇచ్చే వరకు లేదా ఆమె కొత్త ఫోటోలు విడుదల అయ్యేవరకు వేచి చూడాల్సిందే.

5 /5

త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి విశ్వంభర సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. అంతేకాదు, తమిళంలో సూపర్‌స్టార్ సినిమాలో కూడా నటిస్తోంది. ఆమె నటించిన మరో రెండు చిత్రాలు కూడా త్వరలో విడుదల కానున్నాయి.