Vitamin P Benefits: శరీరం నిర్మాణం, ఆరోగ్యం, ఎదుగుదలలో వివిధ రకాల విటమిన్ల అవసరం ఉంటుంది. ప్రతి విటమిన్ అవసరమే. ఈ క్రమంలోనే మీరు ఇప్పటి వరకూ విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే గురంచి వినుంటారు. కానీ ఎప్పుడైనా విటమిన్ పి గురించి విన్నారా..కానీ ఇది ఉంది. విటమిన్ పి అనేది వాస్తవానికి పాత పేరు. ఇప్పుడు దీనిని ఫ్లెవనాయిడ్స్‌గా పిలుస్తున్నారు. వివిధ రకాల పండ్లు, కూరల్లో ఇవి ఉంటాయి. విటమిన్ పి ఏ ఆహార పదార్ధాల్లో సమృద్ధిగా ఉంటుంది, ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
మెదడుకు ప్రయోజనం విటమిన్ పి లేదా ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తినడం వల్ల మెదడు వికాసం బాగుంటుంది. ఆరోగ్యంగా ఉంటుంది. ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది
కేన్సర్ నుంచి రక్షణ విటమిన్ పి లేదా ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉండే పదార్ధాలు తినడం వల్ల కేన్సర్ ముప్పు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో కేన్సర్ నిరోధక గుణాలుంటాయి. కేన్సర్ కణాలు ఎదగకుండా అరికడతాయి. బ్రెస్ట్, లంగ్స్, కడుపు కేన్సర్ సహా అన్నింటినీ నియంత్రిస్తుంది
కంటి చూపు విటమిన్ పి లేదా ఫ్లెవనాయిడ్స్ కళ్లలోని రక్త నాళాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. కేటరాక్ట్, మాక్యులర్ డీజనరేషన్ వంటి సమస్యల ముప్పు తగ్గిస్తుంది
ఇమ్యూనిటీ విటమిన్ సి అధికంగా ఉండే భోజనం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా జలుబు, దగ్గు వంటి వైరల్ వ్యాధుల ముప్పు తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాల్ని డ్యామేజ్ చేసే ఫ్రీ రాడికల్స్ ను అరికడతాయి
గుండె ఆరోగ్యం విటమిన్ పి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తినడం వల్ల రక్త నాళికల పనితీరు బాగుంటుంది. ఫలితంగా గుండె వ్యాధుల ముప్పు చాలావరకు తగ్గుతుంది. గుండె వ్యాధి సమస్యలున్నవాళ్లు ఫ్లెవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి