Water Drinking Tips: రోజూ నీళ్లు ఏ సమయంలో ఎంత తాగితే మంచిది, ఏది బెస్ట్

మనిషి ఆరోగ్యంా ఉండాలంటే రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఏ సమయంలో ఎంత నీళ్లు తాగాలనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఆ వివరాలు మీ కోసం

Water Drinking Tips: మనిషి ఆరోగ్యంా ఉండాలంటే రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం. రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తప్పకుండా తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే ఏ సమయంలో ఎంత నీళ్లు తాగాలనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఆ వివరాలు మీ కోసం
 

1 /4

నీళ్లు ఎప్పుడూ గ్లాసుతోనే తాగాలి. చాలామంది బోటిల్‌తో నీళ్లు తాగుతుంటారు. దీనివల్ల కడుపులో గాలి చొరబడుతుంది. దాంతో కడుపు ఉబ్బరం సమస్య రావచ్చు. అందుకే ఎప్పుడూ నీళ్లు గ్లాసుతోనే తాగాలి. ఉదయం పరగడుపున నీళ్లలో నిమ్మ రసం పిండుకుని తాగితే తాగితే చాలామంచిది. బాడీ పూర్తగా డీటాక్స్ అవుతుంది.

2 /4

చాలా మంది వైద్య నిపుణుల ప్రకారం భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో ఎసిడిటీ ఉంటుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. భోజనం చేయడానికి 20 నిమిషాల ముందు నీళ్లు తాగాలి. భోజనం చేసిన గంట తరువాత మళ్లీ నీళ్లు తాగాలి

3 /4

వేసవి కాలంలో నీళ్లు మరింత ఎక్కువగా తాగాల్సి ఉంటుంది. శరీరం అంతర్గత ఉష్ణోగ్రత బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలు ఎదురౌతాయి. నీళ్లు ఎప్పుడూ ఒకేసారి తాగకూడదు. కొద్ది కొద్దిగా తాగుతుండాలి.

4 /4

ప్రతి రోజూ ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరమౌతాయి. నీళ్లు ఎప్పుడూ కూర్చొనే తాగాలి. నిలుచుని తాగడం మంచి అలవాటు కాదు. కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు