Saif Ali Khan Stabbed: సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ చేరుకున్నారు. అక్కడి పోలీసులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ ఇంట్లో నిన్న రాత్రి ఇద్దరు దుండగులు ప్రవేశించి చోరీకి యత్నించారు. దీంతో సైఫ్ అలజడి కావడంతో అక్కడికి వెళ్లి చూశారు. ఈ క్రమంలో పెనుగులాట సంభవించింది. దుండగుడు.. పదునైన కత్తితో సైఫ్ మీద దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా దయామారన్ ను నియమించారు.
దీంతో అరుపులు, కేకలతో సైఫ్ కుమారుడు మేల్కొన్నాడు. అప్పటికే దుండగులు పారిపోయారు. ఒంటినిండా రక్తపు గాయాలతో ఉన్న సైఫ్ ను.. ఆయన కుమారుడు ఆటోలనో లీలావతి ఆస్పత్రికి తరలించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. సైఫ్ ఇంట్లోని సీసీ ఫుటేజీని పరిశీలించారు. పక్కింటి సీసీ కెమెరాలో దుండగుల ఆనవాళ్లను గుర్తించారు.
ముంబైలో సైఫ్ అలీఖాన్ ఇంటికి ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ దయా నాయక్ చేరుకున్నారు. అక్కడ విచారణ చేపట్టారు. పోలీసుల నుంచి అనేక వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ముంబై క్రైమ్ బ్రాంచ్ కమిషనర్ దయా నాయక్ వార్తలలో నిలిచారు. దయానాయక్ కర్ణాటకలోని ఉడిపిలోని కొంకణ్ జిల్లాలో జన్మించారు. ఆతర్వాత 1979 లో ముంబైకి వెళ్లారు. ఒకవైపు పనిచేస్తునే.. మరొవైపు మున్సిపాల్ స్కూల్ లో విద్యనభ్యసించారు. అంధేరీ కాలేజీలో సీఈఎస్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకున్నారు.
1995 లో స్టేట్ పోలీసు ఎగ్జామ్ లో విజయం సాధించారు. జుహీ పీఎస్ లో విధుల్లో చేరారు. దయా నాయక్.. విధుల్లో చేరిన సమయంలో.. 1996 లో చోటగ్యాంగ్ అరాచకాలు విపరీతంగా ఉండేవి. దీంతో ఆయన ఇద్దరు చోటా రాజన్ అనుచరుల్ని ఎన్ కౌంటర్ చేశాడు. దీంతో డిపార్ట్ మెంట్ లో ఆయనకు ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా మార్మోగిపోయింది.
అదే ఊపులో ఆయన.. 80 కి పైగా ఎన్ కౌంటర్ లు చేశాడు. మరొవైపు ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఏసీబీ అధికారులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత.. ముంబై వెస్ట్ కు కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. దయా నాయక్ స్పూర్తితో అనేక సినిమాలు కూడా వచ్చాయి.
దశాబ్దకాలంగా.. అనేక యాక్షన్ చిత్రాలలో నటించారు. ఈ పోలీసు బాలీవుడ్, దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో 20కి పైగా చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం అతను క్రైమ్ బ్రాంచ్ యూనిట్ 9 (ఖర్-బాంద్రా)కి కమిషనర్ గా విధుల్లొ ఉన్నారు. షిమిత్ అమీన్ దర్శకత్వం వహించిన అబ్ తక్ ఛప్పన్, ఎన్. చంద్ర కగర్ వంటి అనేక హిందీ మూవీస్ లో ఆయన వ్యక్తిగత అనుభవాలు తీసుకున్నారు.
కన్నడ చిత్రం ఎన్ కౌంటర్ దయా నాయక్ కూడా అతని జీవితం ఆధారంగా రూపొందించబడింది. అబ్ తక్ చప్పన్ తర్వాత తెలుగులో సిద్ధమ్ పేరుతో రీమేక్ చేయబడింది. 2010లో తెలుగు సినిమా గోలీమార్ దయా మారన్ ఆధారంగా తెరకెక్కింది. అబ్ తక్ చప్పన్ 2 అనే సీక్వెల్ ఫిబ్రవరి 2015లో విడుదలైంది.అదే విధంగా.. 2015లో తెలుగు సినిమా టెంపర్‌లో కూడా దయా మారన్ పేరు మీదుగా.. జూనియర్ ఎన్టీఆర్ నటించారు. దీనిలో కూడా కొన్ని ఘటనలు దయామారన్ జీవితం ఆధారంగా రూపొందించారు.