Prathika Rawal: సైకాలజీ టు క్రికెటర్‌.. ఈ అమ్మాయి టాలెంట్‌కు సాటి ఎవరూ లేరు ఫ్రెండ్స్‌

Prathika Rawal: కొందరు మల్టీ టాలెంటెడ్‌ ఉంటారు.. గేమ్స్‌ బాగా ఆడతారు.. అలానే చదువులోనూ టాపర్‌గా ఉంటారు. సరిగ్గా అలాంటి అమ్మాయే ప్రతీక రావల్‌..! ఆమె గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం!
 

1 /7

Prathika Rawal: చదువులో టాపర్.. బాస్కెట్‌ బాల్‌ గోల్డ్‌మెడలిస్ట్.. సైకాలజీ స్టూడెంట్‌.. క్రికెట్‌ అంటే ఎనలేని ప్రేమ! ఇన్నీ స్కిల్స్‌ ఉన్న వారికి తిరుగుంటుందా? టీమిండియా నయా సంచలనం ప్రతీకా రావల్‌ గురించి దేశవ్యాప్తంగా క్రికెట్‌ సర్కిల్స్‌లో తెగ చర్చ నడుస్తోంది. ఐర్లాండ్‌పై జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన ప్రదర్శనతో సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది ప్రతీక. ఈ మ్యాచ్‌లో 129 బంతుల్లో 154 పరుగులు చేసిన ఆమె, స్టాండ్-ఇన్ కెప్టెన్ స్మృతి మంధానతో కలిసి 233 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది.   

2 /7

ఢిల్లీకి చెందిన ఈ క్రికెటర్, రైల్వేస్ తరపున డొమెస్టిక్‌ క్రికెట్ ఆడుతుండేది. బీసీసీఐ లెవెల్-2 అంపైర్ అయిన తన తండ్రి ప్రదీప్ రావల్ నుంచి ప్రేరణ పొందిన ఆమె ఆయనతో కలిసి మ్యాచ్‌లు చూడటానికి వెళ్లేది. ఇలా ఆమెకు తెలియకుండానే చిన్నతనం నుంచే క్రికెట్‌పై ప్రేమ పెరిగిపోయింది. 10ఏళ్ల వరకు బాస్కెట్‌ బాల్‌ పోటిల్లో స్కూల్‌ లెవల్‌లో అద్భుతాలు సృష్టించిన ప్రతీక ఆ తర్వాత క్రికెట్‌నే ప్రాణంగా ప్రేమించడం మొదలు పెట్టింది.   

3 /7

అబ్బాయిలతో పోటిపడి.. ఢిల్లీలోని రోహ్తక్ రోడ్ జింఖానా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకున్న ఆమె.. తక్కువ సమయంలోనే బ్యాటింగ్‌ టెక్నిక్స్‌ను నేర్చుకుంది. ప్రాక్టీస్‌ టైమ్‌లో అబ్బాయిలతో కలిసి పోటీ పడి బౌండరీలు బాదేది. ఇలా ఓవైపు క్రికెటర్‌గా కెరీర్‌ను బిల్డ్‌ చేసుకుంటూనే మరోవైపు చదువులోనూ సత్తా చాటేది. CBSE 12వ తరగతి పరీక్షల్లో ఆమెకు 92.5శాతం మార్కులు వచ్చాయి.   

4 /7

ఢిల్లీ యూనిర్సిటీలో సైకాలజీ కోర్సు పూర్తి చేసిన ప్రతీక.. మరోవైపు ఢిల్లీ మహిళా జట్టు కెప్టెన్‌గానూ వ్యవహరించింది. డొమెస్టిక్‌ క్రికెట్‌లో నిలకడ ప్రదర్శన కనబరిచిన ఆమెకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడేందుకు బీసీసీఐ తలుపులు తెరిచింది. 2024 డిసెంబర్‌ 22న భారత మహిళల జట్టు తరఫున అరంగేట్రం చేసింది ప్రతీక. వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన చేతుల మీదుగా డెబ్యూ క్యాప్ అందుకొన్న ఈ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు అదే మంధానతో కలిసి రికార్డు పార్ట్‌నెర్‌షిప్‌ క్రియేట్ చేసి శభాష్‌ అనిపించుకుంది.

5 /7

సైకాలజీ ఇన్‌ క్రికెట్ ఐర్లాండ్‌పై అద్భుతమైన ప్రదర్శన తర్వాత, ప్రతీక తన విజయాన్ని క్రికెట్‌పై ఉన్న ప్రేమ, సైకాలజీలో సాధించిన పరిజ్ఞానానికి క్రెడిట్ ఇచ్చింది. సైకాలజీ క్రికెట్‌కు ఎలా సహాయపడుతుందో నేర్చుకున్నప్పుడు తన ఆట మారిపోయిందని ఎమోషనల్‌ అయ్యింది ప్రతీక. అటు ప్రతీక మాటలను తన ఆటతో కంపేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.   

6 /7

సాధారణంగా మొదటి మ్యాచ్‌, మొదటి సిరీస్‌ అంటే ఎవరైనా ఒత్తిడికి గురవుతారు. కానీ ప్రతీక మాత్రం వెస్టిండీస్‌పై సిరీస్‌లో ఏ మాత్రం బెరుకు లేకుండా ఆడింది. తన అద్భుత ఆటతో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన ఎక్స్‌పిరియన్స్‌డ్‌ ప్లేయర్‌ని తలపించింది.   

7 /7

తొలి మ్యాచ్‌లో 40 పరుగులు చేసిన ప్రతీక అప్పటి నుంచి ఐర్లాండ్‌తో ముగిసిన మ్యాచ్‌ వరకు అద్భుతంగా రాణించింది. కూల్‌గా ఇన్నింగ్స్‌ను బిల్డ్‌ చేసుకోవడంలో రోహిత్‌ శర్మను తలపిస్తున్న ప్రతీక.. హిట్టింగ్‌లో మాత్రం సెహ్వాగ్‌ను గుర్తుచేస్తుందంటున్నారు ఫ్యాన్స్. ఇక భవిష్యత్‌లో ప్రతీక టీమిండియా విమెన్‌ లెజండరీ ప్లేయర్‌ మిథాలీ రాజ్‌ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.