Team Indias ICC ODI World Cup 2023: గత కొన్నేళ్లుగా వన్డేల్లో నాలుగో స్థానంలో సరైన బ్యాట్స్‌మెన్ కోసం టీమిండియా వెతుకుతోంది. టాప్ ఆర్డర్ విఫలమైన సందర్భంలో ఒత్తిడిని ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ నిర్మించడంతోపాటు అవసరమైనప్పుడు దూకుడుగా ఆడాల్సి ఉంటుంది. గత వన్డే ప్రపంచకప్ నుంచి నాలుగో స్థానంలో ఎంతోమందిని పరిశీలించింది. ఈ ప్రపంచకప్‌కు నాలుగోస్థానం కోసం ఎవరెవరు పోటీలో ఉన్నారో ఓసారి చూద్దాం..
ఐపీఎల్ సందర్భంగా గాయపడ్డ కేఎల్ రాహుల్.. ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆసియా కప్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచ కప్ 2019లో కొన్ని మ్యాచ్‌లలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు.
ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఆశించినస్థాయిలో రాణించకపోవడం నిరాశకు గురిచేస్తోంది. కేఎల్ రాహుల్, అయ్యర్ కోలుకోకపోతే.. సూర్యకే ఛాన్స్ దక్కనుంది.
ప్రస్తుతం టీమిండియాకు నాలుగో స్థానంలో ఫస్ట్ ఛాయిస్ శ్రేయాస్ అయ్యర్. గాయం నుంచి కోలుకుని.. పూర్తి ఫిట్‌గా ఉంటే అయ్యర్‌ను నాలుగోస్థానంలో చూడొచ్చు.
నాలుగో స్థానంలో మరో ప్రత్యామ్నయం సంజూ శాంసన్. అయితే వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు సంజూ. సెలక్టర్లు సంజూను కూడా ఆప్షన్‌గా ఉంచుకోవచ్చు.
ఇషాన్ కిషన్‌ను కూడా నాలుగోస్థానంలో ఆడించే ఛాన్స్ ఉంది. ఓపెనింగ్ స్లాట్‌లో ఖాళీ లేకపోవడంతో ఇషాన్‌కు మిడిల్ ఆర్డర్‌లో ఛాన్స్ ఇవ్వొచ్చు. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్‌మెన్ కావడం కూడా కలిసి వస్తుంది.
కారు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్.. ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ నాటికి ఫిట్‌గా ఉంటే అద్భుతమనే చెప్పాలి. మిడిలార్డర్‌లో టీమిండియాకు పెద్ద బూస్ట్ అవుతుంది.