Costly Fish: ప్రపంచంలో అత్యంత విలువైన చేప ఇదే, ఈ చేపకు సెక్యూరిటీ గార్డులు కూడా

ప్రపంచంలో రెండు రకాల చేపలుంటాయి. తినే చేపలు..అక్వేరియంలో పెంచుకునే చేపలు. ఏమైనా సరే చేపల కోసం మహా అయితే 5-10 వేల రూపాయలు ఖర్చు పెడతారు అంతేగా. అయితే ప్రపంచంలో కోట్లాది రూపాయల విలువ చేసే చేపలు కూడా ఉన్నాయి తెలుసా. అవేంటో తెలుసుకుందాం..
  • Sep 15, 2021, 15:20 PM IST

Costly Fish: ప్రపంచంలో రెండు రకాల చేపలుంటాయి. తినే చేపలు..అక్వేరియంలో పెంచుకునే చేపలు. ఏమైనా సరే చేపల కోసం మహా అయితే 5-10 వేల రూపాయలు ఖర్చు పెడతారు అంతేగా. అయితే ప్రపంచంలో కోట్లాది రూపాయల విలువ చేసే చేపలు కూడా ఉన్నాయి తెలుసా. అవేంటో తెలుసుకుందాం..

1 /5

ఏరోవానా అనేది సాధారణ అక్వేరియం ఫిష్ కానే కాదు. ఇది దక్షిణ తూర్పు ఆసియాలో మాత్రమే లభిస్తుంది. ఇది దాదాపు 3 అడుగులు పొడుగుంటుంది. దీని విలువ ఎక్కువ కాబట్టి..దొంగలు కూడా ఎక్కువైపోయారు.

2 /5

చైనా ప్రజలు ఈ చేప కోసం కోరిన డబ్బిచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. ఈ చేపలపై The Dragon Behind the Glassపేరుతో ఓ పుస్తకం కూడా ఉంది. ఈ పుస్తకంలో ఈ చేప గురించి పూర్తి వివరాలున్నాయి.

3 /5

ఈ చేపలకు పెట్టే ఖర్చుతో మంచి బంగ్లా లేదా ఇళ్లు కొనుగోలు చేయవచ్చని భావిస్తున్నారు కదా. నిజమే. చేపలపై ఇంత డబ్బులు ఖర్చు పెట్టడం అవసరమా అన్పిస్తుంది. కానీ ఏసియన్ ఏరోవానా చేప అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని నమ్ముతారు. చైనాలో ఈ చేపను స్టేటస్ సింబల్‌గా పరిగణిస్తారు. 

4 /5

ఈ చేపను కొనుగోలు చేసేందుకే కాదు..ఆ చేప రక్షణకు కూడా చాలా డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఈ చేపల రక్షణ కోసం గార్డుల్ని నియమిస్తుంటారు. ఆ అక్వేరియం కోసం ప్రత్యేక సెక్యురిటీ డిజైన్ చేస్తారు. 

5 /5

డ్రాగన్ చేప ప్రపంచంలోని ఖరీదైన చేపగా ఉంది. దీన్నే ఏసియన్ ఏరోవానా అని కూడా పిలుస్తారు. ఈ ఒక్క చేప 2-3 కోట్ల రూపాయలుంటుందట.