Zee Kannada Anniversary Achievers Award: జీ కన్నడ న్యూస్ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో చేసిన కృషికి 46 మందిని అవార్డులతో సత్కరించారు. ఈ వేడుక ఫిబ్రవరి 9 ఆదివారం జరిగింది. ముఖ్య అతిథులుగా శ్రీ నిర్మలానందనాథ్ స్వామిజీతోపాటు డీకే శివకుమార్ తదితరులు హాజరయ్యారు.
జీ కన్నడ న్యూస్ వార్షికోత్సవ వేడుక రిట్జ్ కార్లటన్ హోటల్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి శ్రీ శ్రీ శ్రీ నిర్మలానందనాథ్ స్వామిజీ, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా హాజరయ్యారు. జీ కన్నడ న్యూస్ మూడవ వార్షికోత్సవం సందర్భంగా జీ అచీవర్స్ అవార్డుతో 2025 సత్కరించారు.
ఈ ఉత్సవంలో వివిధ రంగాలకు చెందిన 46 మందిని జీ న్యూస్ అచీవర్స్ అవార్డుతో సత్కరించారు. వీరి సామాజిక సేవకు గుర్తుకు ఈ అవార్డులను జీ సత్కరించింది. జీ కన్నడ న్యూస్ ఎడిటర్ ఎస్ రవి సామాజిక సేవ, వాణిజ్య విభాగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి జీ కన్నడ న్యూస్ అచీవర్స్ అవార్డులు అందిస్తున్నట్లు చెప్పారు.
జీ న్యూస్ అచీవర్స్ అవార్డు ఉత్సవాల్లో జీ కన్నడ న్యూస్ ఎడిటర్ రవిని స్వామిజీ ఆశీర్వదించారు. సీఎం సిద్ధరామయ్య కూడా 46 మంది అవార్డుగ్రహితలను వీడియో ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు
అవార్డుగ్రహీతలకు స్వయంగా డీకే శివకుమార్ సత్కరించి, ప్రదానం చేశారు. అంతేకాదు జీ సమాజ అభివృద్ధికి చేస్తోందని జీ న్యూస్ కన్నడ కృషిని శివకుమార్ కొనియాడారు.
కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ అవార్డుగ్రహీతలను ప్రశంసించారు. సామాజిక సేవతో వివిధ రంగాల్లో సేవకు అభినందించారు.
జీ కన్నడ అఛీవర్స్ అవార్డుగ్రహీతలు వీరే.. సత్యనారాయణ- పారాఒలింపిక్ కోచ్, సంజయ్ బైద్ - బిజినెస్‌మెన్, బీసీ జయప్రసాద్- సేంద్రీయ రైతు గోపీకృష్ణ- సోషల్‌వర్కర్
శశికుమార్ తిమ్మయ్య- బిజినెస్‌మెన్, కేఎం సందేశ్- సోషల్ వర్కర్, సుందర్ రాజపత్తి- బిజినెస్‌మెన్, డా. శరద్ కులకర్ణి- ఆయుర్వేదిక్ వైద్యులు వీరపాటు మొత్తం 46 మందికి అవార్డులతో సత్కరించారు.