Viral Video Bride Up Up and Away: పెళ్లి కూతురిని గాల్లోకి ఎగురవేసిన ఫ్రెండ్స్‌.. బ్యాలెన్స్ తప్పి ఏమైందంటే..

Viral Video Bride friends did Up Up and away in the wedding : పెళ్లి కూతురిని గాల్లోకి ఎగురవేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు వారంతా. కానీ అనుకోని ఒక పరిణామం జరిగింది. బ్యాలెన్స్ తప్పడంతో పెళ్లి కూతురు కింద పడబోయింది. ఆమె పొడవాటి డ్రెస్‌ను గట్టిగా పట్టుకున్నా ఫలితం లేకపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2022, 11:20 AM IST
  • పెళ్లి కూతురిని గాలిలోకి ఎత్తి వేసిన స్నేహితులు
  • అదపు తప్పడంతో కింద పడబోయిన పెళ్లి కూతురు
  • కిందపడకుండా కాపాడిన వరుడు
Viral Video Bride Up Up and Away: పెళ్లి కూతురిని గాల్లోకి ఎగురవేసిన ఫ్రెండ్స్‌.. బ్యాలెన్స్ తప్పి ఏమైందంటే..

Bride friends did Up Up and away in the wedding function groom defend new bride: పెళ్లి అంటేనే ఎంతో సరదా సరదాగా ఉంటుంది. కొన్ని పెళ్లిళ్లు చాలా సింపుల్‌గా జరుగుతుంటాయి. మరికొన్ని వివాహాలు (Weddings) చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. కొన్ని వివాహా వేడుకల్లో సాహసాలు అన్నీ ప్రదర్శిస్తుంటారు. 

ఇలాంటి క్రమంలో ఒక్కోసారి అనుకోని సంఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. కొందరు పెళ్లి కొడుకును ఎత్తుకొని డ్యాన్స్ చేస్తుంటారు. కొందరు పెళ్లి కూతుర్ని గాల్లోకి (in to air) ఎత్తి వేస్తుంటారు. ఇలా రకరకాల విన్యాసాలు వివాహాలలో (weddings) జరుగుతుంటాయి. కొన్ని సంప్రదాయం మేరకు చేస్తుంటారు.. మరికొన్ని మాత్రం ఏదో సరదాకు (Fun) చేస్తుంటారు. 

అలాంటి ఘటనే ఒక పెళ్లిలో జరిగింది. ఆ వివాహంలో వాతావరణం అంతా సందడి సందడిగా ఉంది. అక్కడికి వచ్చిన వారంతా ఫుల్ జోష్‌లో (Full Josh) ఉన్నారు. ఈ క్రమంలో పెళ్లి కూతురిని కొందరు స్నేహితులు (Friends) గాలిలోకి ఎత్తి వేసేందుకు రెడీ అయ్యారు. అందరూ ఒక్కసారిగా ఆమెను పైకి ఎత్తి గాల్లోకి ఎగురవేశారు. అక్కడున్న వారంతా కూడా సరదగా సరదాగా సాగుతోన్న ఆ కార్యక్రమాన్ని చూసి ఫుల్ ఎంజాయ్ (Full enjoy) చేస్తున్నారు. 

ఫస్ట్ సారి పెళ్లి కూతురిని బాగానే గాల్లోకి ఎగురవేశారు. తర్వాత మళ్లీ ఆమెను గాల్లోకి ఎగురవేసేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సారి బ్యాలెన్స్ తప్పింది. ఒక్కసారిగా పెళ్లి కూతురు (Bride) కింద పడబోయింది. ఆమె పొడవాటి ఫ్రాగ్‌ను గట్టిగా పట్టుకున్నారు ఫ్రెండ్స్. అయినా ఫలితం లేకపోయింది. ఇక అక్కడే ఉన్న వరుడు ఆమె కింద పడిపోవడాన్ని గమనించాడు. వెంటనే అలెర్ట్ అయి ఆమె కిందపడకుండా పట్టుకున్నాడు. మొత్తానికి వధువుకు పెద్ద ప్రమాదమే తప్పింది.

 

Also Read : Tiger Bear Fight: పులిని వెంటాడి, వేటాడిన ఎలుగుబంటి.. వైరల్ వీడియో

వధువు బ్యాలెన్స్ (Balance) తప్పడంతో కొన్ని క్షణాల పాటు అక్కడున్నవారంతా షాక్‌కు గురయ్యారు. ఆమె కిందపడుతుందని ఫిక్స్ అయ్యారు. కానీ వరుడు (bridegroom) ఆమెను కిందపడకుండా రక్షించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. నెటిజెన్స్ ఈ వీడియోపై పలు కామెంట్స్ చేస్తున్నారు. 'అదృష్టవశాత్తు ఆమెకు ఏం కాలేదు' అని ఒకరు.. 'ఆమె హెయిర్‌ స్టైల్ (Hair style) చాలా బాగుంది' అని మరొకరు.. "ఆమె కిందపడిపోతుందని అతను ముందే గ్రహించాడు" అంటూ మరొకరు ఇలా రకరకాలుగా ఈ పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Dangerous Snake Video: భయంకరమైన వీడియో- యువతిని పదేపదే కాటు వేసిన సర్పం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News