Facebook on Talibans: ఆఫ్ఘనిస్తాన్‌లో విజయం సాధించిన తాలిబన్లపై ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ నిషేధం విధించింది. తాలిబన్ ముఠాను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నట్టు సంచలన ప్రకటన విడుదల చేసింది.
ఆఫ్ఘనిస్తాన్‌లో(Afghanistan)పరిస్థితులు మారిపోయాయి. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ మాత్రం తాలిబన్లపై నిషేధం విధించింది. తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తున్నామని..తాలిబన్ ఉగ్రవాదుల్ని సమర్ధించే అన్ని రకాల కంటెంట్ తొలగిస్తున్నట్టు తెలిపింది. తాలిబన్లకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించి..తొలగించేందుకు ఆప్ఘనిస్తాన్ నిపుణులతో కూడిన బృందం తమ సంస్థలో ఉందని ఫేస్‌బుక్ పేర్కొంది.
ఆఫ్ఘనిస్తాన్‌లో చాలాఏళ్లుగా తమ భావజాలం, సందేశాల్ని ప్రజలకు చేరవేసేందుకు తాలిబన్లు(Talibans)సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వాట్సప్‌ను విరివిగా ఉపయోగిస్తున్నారు. తాలిబన్లకు సంబంధించిన ఖాతాలు ఏమైనా ఉంటే చర్యలు తీసుకుంటామని వాట్సప్(Whatsapp)స్పష్టం చేసింది.ఫేస్‌బుక్ విధించిన నిషేధం వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కూడా అమలుకానుంది. అమెరికా చట్టాల ప్రకారం తాలిబన్లను ఉగ్రవాద సంస్థగా నిర్ధారించారు. డేంజరస్ ఆర్గనైజేషన్ పాలసీలో భాగంగా తాలిబన్లను నిషేధించామని ఫేస్‌బుక్(Facebook Bans Talibans) తెలిపింది.ఫేస్‌బుక్ వేదికపై తాలిబన్లను ప్రశంసించడాన్ని, సమర్ధించడాన్ని, వాదించడాన్ని నిషేధించామని ఫేస్‌బుక్(Facebook)స్పష్టం చేసింది. ఆఫ్ఘన్‌లో ఏర్పాటైన తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించే విషయంలో నిర్ణయం తీసుకోలేదని..అంతర్జాతీయ సమాజం ప్రకారం అనుసరిస్తామని వెల్లడించింది.
Also read: Afghanistan: ఇండియాకు క్షేమంగా చేరిన ఆఫ్ఘన్‌లోని దౌత్యసిబ్బంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి