King Cobra In Washing Machine Video: పాములు చూడగానే మనసులు ఆమడంత దూరం పరిగెడుతూ ఉంటారు. మనుషులేం కర్మ జంతువులు కూడా అడవుల్లో పాములను చూసి ఎంత దూరం పరిగెడతాయో మనం తరచుగా డిస్కవర్ లాంటి టీవీ చానల్స్ లో చూసి ఉంటాము. అయితే అడవుల్లో ఆహార వనరులు తగ్గిపోవడం కారణంగా ప్రస్తుతం జంతువులతో పాటు పాములు కూడా ఊర్లలోకి వస్తున్నాయి. దీంతో అడవి పరివాహక ప్రాంతాల్లో ఉండే ఇళ్లలోకి చొరబడి సంచారం చేస్తున్నాయి. ఇటీవల ఇలా చాలాచోట్ల అనేక సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి వీడియోస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఇంట్లో వాషింగ్ మెషిన్ లోపల చొరబడిన వాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియో ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
#Watch : कोटा शहर में एक शख्स के तब होश उड़ गए जब उसने कपड़े साफ करने के लिए वॉशिंग मशीन का ढक्कन हटाया। शख्स ने जब वॉशिंग मशीन का ढक्कन खोला तो उसमें फन फैलाए बड़ा सा कोबरा बैठा था। इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है।#Snake #Kota #Rajasthan pic.twitter.com/elTFnfJ4ht
— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) August 20, 2024
వీడియో వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్లోని ఓ ప్రాంతంలో ఈ పాముకు సంబంధించిన సంఘటన జరిగింది. అయితే ఒక వ్యక్తి తన బట్టలను ఉతికేందుకు వాషింగ్ మిషన్ మూతను ఓపెన్ చేశాడు. దీంతో పాము ఒక్కసారిగా బుసుమని పైకి లేచింది.. దీంతో ఆ వ్యక్తి పెద్దగా కేకలు వేస్తూ శబ్దం చేశాడు. నిజానికి అడవి ప్రాంతాల్లో జీవించే వారి ఇళ్లలోకి పాములు ఎంతో సులభంగా ప్రవేశిస్తాయి అంతేకాకుండా ఇవి వాటికి ఇష్టమైన ప్రదేశాల్లో సీత తీరేందుకు ఎక్కువగా ఇష్టపడతాయి కాబట్టి నదీ పరివాహక ప్రాంతాలు అడవి పరివాహక ప్రాంతాల్లో జీవించే ప్రజలు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటిస్తూ రోజువారి కార్యక్రమాలు చేసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుతం వాషింగ్ మెషన్ లో దూరిన పాము కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఈ పామును చూసేందుకు చుట్టుపక్కల ఉండే జనాలు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో ఆ ఇంటి యజమాని అడవి శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందించిన వెంటనే అక్కడికి ప్రముఖ స్నేక్ క్యాచర్ గోవింద్ శర్మ చేరుకుని.. పామును పరీక్షించి చూశారు. దీంతో ఇది మామూలైన పాము కాదని అతి ప్రమాదకరమైన బ్లాక్ కింగ్ కోబ్రా అని తెలిపారు. ఈ పాము దాదాపు 5 అడుగులకు పైగానే ఉందని వర్షం కారణంగానే ఇంట్లోకి ప్రవేశించిందని ఆయన అన్నారు.
ఈ వీడియోను ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ X లో షేర్ చేశారు దీనిని ఇప్పటివరకు వేల మందికిపైగా వీక్షించగా వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అయితే ఈ పాము చాలా ప్రమాదకరమని రాసుకురాగ.. మరికొందరైతే అడవి ప్రాంతాల్లో జీవించే వ్యక్తులు తరచుగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ రోజువారి పనులు చేసుకోవడం మంచిదని సూచించారు. మరికొందరైతే ఇలాంటి ప్రమాదకరమైన పాముని నేనెప్పుడూ చూడలేదని క్యాప్షన్ పెట్టి షేర్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అయ్యాయి. కానీ ఈ పాము వీడియో అన్నింటికంటే భిన్నంగా ఉందని మరి కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter