Zeddywill : అమెరికాలోని న్యూయార్క్‌కు చెందిన జెడ్డీ విల్ ర్యాప్ పాటగాడు. పాటలు పాడుతూ పాప్ సంగీతంతో బిజీగా ఉన్నాడు. తన పాటలతో ఆ దేశంలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఓ కార్యక్రమం నిర్వహించడంతో అతడు ఒక్కసారిగా మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. తన వలన గర్భం దాల్చిన ఐదుగురు మహిళలతో బేబి షవర్ (శ్రీమంతంలాంటిది) వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ఫొటో షూట్ జరిగింది. గర్భం దాల్చిన ఆ ఐదుగురు మహిళలతో జెడ్డీ కలిసి దిగిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. టిక్‌టాక్ ద్వారా అతడి భార్య ఆష్లే ఆ వివరాలను పంచుకుంది.
'1 - 5 బుల్లి జెడ్డీలకు స్వాగతం' అని ఆష్లే పోస్టు చేసింది. జెడ్డీ మొదట ఆష్లేతో బంధాన్ని ఏర్పరచుకున్నాడు. అనంతరం బొన్నీ బి, జెలెని విలా, కే మేరి, ఇయాన్‌లా ఖలీఫా గల్లెట్టితో అనుబంధం కొనసాగిస్తున్నాడు. ఆ ఐదుగురు మహిళలతో జెడ్డీతో సంసారం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళలు గర్భం దాల్చారు. అయితే అందరూ ఒకేసారి గర్భం దాల్చడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సహజ పద్ధతిలో అలా జరగడం వైద్యశాస్త్రంలో దాదాపుగా సాధ్యం కాదు. కానీ కొన్ని ప్రత్యేక చర్యలతో తాము ముందుగానే ప్రణాళిక వేసుకుని అందరం ఒకేసారి గర్భం దాల్చాలని నిర్ణయించినట్లు ఆష్లే తెలిపింది.
మేం ఐదుగురం ఒకేసారి ఒకే సమయంలో ప్రసవం చేయించుకోవాలని అనుకుంటున్నట్లు జెడ్డీ మరో భార్య తెలిపింది. అందులో భాగంగానే ఒకేసారి బేబీ షవర్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నట్లు వెల్లడించింది. 'ప్రసవం తేదీ సమీపిస్తోంది. మేం అందరం కవలలకు జన్మనివ్వబోతున్నట్లు ఉంది' అని పేర్కొంది. తాము పరస్పరం సహకరించుకుని పండంటి పాపలకు జన్మనివ్వాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. మా అందమైన కుటుంబాన్ని చూడండి అంటూ ఆష్లే తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.
ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. నీ వయసెంత నీవు చేసే పనులేంట్రా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాకు ఒక్క పెళ్లికే దిక్కు లేదు నీకేంటి ఐదుగురు భార్యలా? ఒరినాయనో అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు 'భద్రంగా ఉండండి. సుఖ ప్రసవం పొందాలి' అని సూచిస్తున్నారు. ఆష్లే పంచుకున్న వీడియో, ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Also Read Lok Sabha Elections: సర్వీసింగ్‌కు వెళ్లిన 'కారు' యమస్పీడ్‌తో దూసుకొస్తది: కేటీఆర్
Also Read: Ayodhya Pran Pratishtha: గుడిలో బండలు తుడిచిన కేంద్రమంత్రి అమిత్ షా, తెలంగాణ గవర్నర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి