Cow Viral Video: ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు చేసేది కేవలం రాజకీయాలేనని మూగ జంతువులు కూడా పసిగట్టేశాయి. అందుకే తనను వెంట తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యేను వదిలి..ఒకటే పరుగు లంకించింది.
ఆవుల్లో ప్రస్తుతం లంపీ వైరస్ విస్తరిస్తోంది. దీనిపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు రాజస్థాన్‌లోని బీజేపీ ఎమ్మెల్యే ఏకంగా ఓ ఆవును తీసుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చారు. ఎమ్మెల్యే ఆవును తీసుకుని అసెంబ్లీకి వస్తున్న విషయం తెలుసుకుని మీడియా కూడా చేరుకుంది. ఇంకేముంది..బీజేపీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడేందుకు సిద్ధమౌతుండగా..ఆ హడావిడికి ఆవు బెదిరి పరుగు లంకించుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
మీడియా సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యే హడావిడి చూసి ఆ ఆవు బెదిరిపోయినట్టుంది. వేగంగా పరుగు లంకించుకుంది. ఆపేందుకు ఓ వ్యక్తి చివరి వరకూ వెళ్లినా చిక్కలేదు. అయితే ఆవు పారిపోవడాన్ని చూసిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ రావత్ మరోలా భాష్యం చెప్పారు. గోమాత కూడా ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉందని..లంపీ వైరస్ నుంచి సంరక్షించేందుకు మందులు, వ్యాక్సిన్ ఏర్పాట్లు చేయాలని కోరారు.
भाजपा विधायक सुरेश रावत गाय को लेकर विधानसभा पहुंचे थे लेकिन गाय को पता चल गया ये सिर्फ कोरी राजनीति कर रहे हैं
देखिए गाय कैसे पीछा छुड़ाकर भाग गईpic.twitter.com/p5Wo58jKvO
— Nigar Parveen (@NigarNawab) September 19, 2022
ఇదే విషయంపై అసెంబ్లీలో ఆర్ఎల్పీకు చెందిన ముగ్గురు శాసనసభ్యులు కూడా ధర్నాకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. లంపీ వైరస్‌ను విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కేంద్రాన్ని కోరారు. లంపీ వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు జరిగిన ఈ ఘటనపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. రాజకీయాలు చూసి ఆవుకు కూడా చిరాకు వేసినట్టుంది. అందుకే వీలు చూసుకుని పారిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also read: King Cobra Viral Video: మోరీలో దూరిన భారీ కింగ్ కోబ్రా.. ఈ వ్యక్తి ఎలా పట్టాడో చూడండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook