Snake Virla Video: మీరు రోజూ కూర్చునే కుర్చీ కింద..భయంకరమైన కోబ్రా దాక్కుని ఉంటే ఏమౌతుంది. భయంతో ఒళ్లు జలదరిస్తుంది కదూ..అదే జరిగింది. కోబ్రా దాక్కున్న ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ రేపుతోంది.
పాముల్లో చాలావరకూ ప్రమాదకరమైనవే ఉంటాయి. ఒక్కసారి కాటేస్తే చాలు ఇక ప్రాణాలు పోయినట్టే. అందుకే పాములంటే జనం అంతగా భయపడుతుంటారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అటువంటిదే పాము వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే చాలు..మీ వెన్నులో వణుకు మొదలవుతుంది. కుర్చీలో కూర్చునేందుకే భయపడిపోతారు. ఎందుకంటే ఆ కుర్చీలో భయంకరమైన పాము దాక్కుని ఉంది. అది కూడా అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా అది. ఈ విషయం తెలిసినవారికి పై ప్రాణాలు పైనే పోయినట్టైంది.
కుర్చీలో దాక్కున్న కింగ్ కోబ్రా
మీ ఇంట్లో ఓ భయంకరమైన పాము దూరి..మీరు తరచూ కూర్చునే కుర్చీలో మీకు కన్పించకుండా దాక్కుని ఉందంటే నమ్ముతారా..అదే జరిగింది. ఈ వైరల్ వీడియోలో అదే కన్పిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఫైబర్ కుర్చీల్లో వెనుకభాగంలోని రెండు కాళ్లు..హేలోగా ఉంటున్నాయి. అంటే మీరు కూర్చునే భాగం నుంచి అడుగు వరకూ కుర్చీ వెనుక భాగంలో రెండు కాళ్లు గొట్టం మాదిరి ఉంటాయి. అందులో ఏమైనా పట్టేస్తాయి. హ్యాలోగా ఉన్న ఆ కుర్చీ కాలిలో ఈ భయంకరమైన కోబ్రా దాక్కుండిపోయింది. టార్చ్ వేసి చూస్తే గానీ తెలియలేదు.ఈ వీడియో చూసిన నెటిజన్లు పెద్దఎత్తున స్పందిస్తున్నారు.
భయంకరమైన కింగ్ కోబ్రా పాము కుర్చీలో దాక్కుని ఉండటం చూసి జనం స్థంభించిపోయారు. భయంతో వెన్నులో వణుకు ప్రారంభమైంది అందరికీ. అసలు ఇలాంటి దృశ్యం ఎప్పుడూ సాధారణంగా కన్పించదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి షేర్ చేసిన ఈ వీడియా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన తరువాత ఎవరైనా సరే..కుర్చీల్లో కూర్చునే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మరీ కూర్చుంటారు. లేదా..హ్యాలోగా ఉన్న కుర్చీల్ని కొనుగోలు చేయడమే మానేస్తారు. లేదా అటువంటి కుర్చీల్లో పొరపాటున కూడా కూర్చునేందుకు సాహసించరు.
Also read: Spooky Viral Video: భయం రేపుతున్న మలేషియా వీడియో, మాయమైన బాలుడు దెయ్యమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.