South Koreas Mom Daughter Dance : కచా బాదం సాంగ్‌కు సౌత్ కొరియన్ తల్లీ కూతురు డ్యాన్స్‌ ఇరగదీశారు!

South Korean Mom Daughter duo to Kacha Badam song : 'కచా బాదం' పాటకు ఒక సౌత్ కొరియన్ తల్లీ కూతురు చేసిన డ్యాన్స్‌ ఇండియన్స్‌కు ఎంతో నచ్చింది. వైరల్ అవుతోన్న వీడియో.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 25, 2022, 03:49 PM IST
  • 'కచా బాదం' పాటకు డ్యాన్స్ చేసిన దక్షిణ కొరియాకు చెందిన తల్లీ కూతురు
  • సోషల్ మీడియాలో వీడియో మస్తు వైరల్
  • కచా బాదమ్‌ సాంగ్‌ పెప్పీ బీట్‌కి తగట్లుగా కూల్ స్టెప్స్
South Koreas Mom Daughter Dance : కచా బాదం సాంగ్‌కు సౌత్ కొరియన్ తల్లీ కూతురు డ్యాన్స్‌ ఇరగదీశారు!

South Koreas Mother Daughter Duo: కొన్ని రోజుల క్రితం, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక వేరుశెనగ దుకాణదారుడు.. వేరుశెనగలు అమ్ముతూ పాడిన జింగిల్ పాట సోషల్ మీడియాలో మస్త్ వైరల్ అయ్యింది. మరో వీడియోలో.. భుబన్ బద్యాకర్ అనే దుకాణదారుడు తన వద్ద బాదం కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లను ఆకర్షించేందుకు ఒక పాట పాడాడు. 'బాదం బాదం కచా బాదం' అని షాప్‌ అతను పాడిన పాట అప్పట్లో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియాఓ ప్లాట్‌ఫామ్స్‌లలో చాలా వైర​ల్ అయ్యింది.

ఇక ఇప్పుడు దక్షిణ కొరియాకు చెందిన ఓ తల్లీ కూతురు (South Koreas Mother Daughter) 'కచా బాదం' పాటకు చేసిన డ్యాన్స్ వీడియో కూడా సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతోంది. 

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తోన్న ఈ వైరల్ వీడియోలో, దక్షిణ కొరియాకు చెందిన దాసోమ్‌ ఆమె తల్లీ ఇద్దరూ చాలా ఫన్నీగా డ్యాన్స్ చేశారు. 'కచా బాదం' సాంగ్‌కు వీరిద్దరూ సరదాగా వేసిన స్టెప్స్‌ చాలా ఫన్నీగా ఉన్నాయి. దాసోమ్ తల్లి కూడా కచా బాదమ్‌ సాంగ్‌ పెప్పీ బీట్‌కి తగట్లుగా కూల్ స్టెప్స్ వేశారు. వీరిద్దరూ ఎంతో ఎంజాయ్ చేస్తూ సాంగ్‌ డ్యాన్స్ చేశారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజెన్స్ అంతా కూడా మస్తు ఫిదా అవుతున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dasom Her (@luna_yogini_official)

 

Also Read : Rashmika Mandanna Slammed: సోషల్ మీడియాలో రష్మికపై దారుణంగా ట్రోలింగ్.. అంతపని చేసిందా?

'కచా బాదం' పాటకు (Kacha Badam Song) ఈ సౌత్ కొరియన్ తల్లీ కూతురు చేసిన డ్యాన్స్‌ను ఇండియన్స్‌ కూడా ఎంతో మెచ్చుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 30 వేలకు మందికి పైగానే వీక్షించారు. ఈ డ్యాన్స్ (Dance) వీడియో  చూసి.. దాసోమ్‌ను మెచ్చుకుంటున్నారు నెటిజెన్స్.

Also Read : UP Elections 2022: కాంగ్రెస్​కు సీనియర్‌ నేత ఆర్‌పీఎన్‌ సింగ్ గుడ్‌బై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News