Wives Done Third Marriage: ఈ కాలంలో వివాహేతర సంబంధం కొనసాగిస్తేనే ప్రాణాలు తీస్తున్నారు. ఈ సమయంలో తమ భర్తకు మూడో వివాహాన్ని జరిపించిన గొప్ప భార్యలు ఉన్నారు. సంతానం కోసమని భర్త అడగడంతో ఆ ఇద్దరు భార్యలు అతడికి ఒక అమ్మాయిని వెతికి మరి పెళ్లి జరిపించారు. పత్రికలు ముద్రించి అందరికీ పంచి పెట్టి అంగరంగ వైభవంగా వివాహం చేయించారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరు సీతారామారాజు జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Tamanna Bhatia: పుస్తకాల్లో హీరోయిన్ జీవితం.. అందాలు ఆరబోసే తమన్నా మా పిల్లలకు ఆదర్శమా?
అల్లూరి సీతారామారాజు జిల్లాలోని పెదబయలు మండలం కించూరు గ్రామానికి చెందిన పండన్నకు ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్నారు. వారి పేర్లు పార్వతమ్మ, అప్పలమ్మ. 200లో మొదటి భార్యగా పార్వతమ్మను వివాహం చేసుకోగా ఎన్ని ప్రయత్నాలైనా సంతానం కలగలేదు. ఈ కారణంతో 2005లో అప్పలమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు 2007లో మగ పిల్లాడు పుట్టాడు. అప్పటి నుంచి మళ్లీ ఆమె గర్భం దాల్చలేదు. సంతానం ఆగిపోవడంతో పండన్న తనకు ఇంకా పిల్లలు కావాలని ఇద్దరు భార్యలకు చెప్పాడు. తమకు పిల్లలు కలగకపోవడంతో ఆ ఇద్దరు భార్యలు తీవ్రంగా ఆలోచించి అతడికి మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు.
Also Read: Snake Viral Video: కమ్మని నిద్రలో ఉండగా లోదుస్తుల్లోకి దూరిపోయిన పాము.. వీడియో వైరల్..
వారిద్దరే పెళ్లి పెద్దలుగా మారి యువతిని వెతికారు. చివరకు లావణ్య అనే అమ్మాయిని చూసి సంబంధం నిశ్చయించారు. పత్రికలు ముద్రించి ఊరంతా పంచి తమ భర్త పెళ్లికి ఆ భార్యలు ఆహ్వానించారు. అంతేకాకుండా ఆ పత్రికల్లో పార్వతమ్మ, అప్పలమ్మ తమ ఫొటోలను కూడా ముద్రించడం విశేషం. ఈనెల 25వ తేదీన పండన్నకు ఇద్దరు భార్యలు పార్వతమ్మ, అప్పలమ్మ మూడో వివాహం జరిపించారు. లావణ్య మెడలో పండన్న మూడు ముళ్లు వేశాడు. భార్యలే అతడికి దగ్గరుండి పెళ్లి జరిపించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చివరకు ఇది బహిర్గతం కావడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఈ కాలంలో ఇలాంటి భార్యలు ఉండడం చాలా గొప్ప అని కామెంట్లు చేస్తున్నారు. అదృష్టవంతుడివంటే నువ్వే పండన్న అంటూ అభినందిస్తున్నారు. ఇలాంటి కథలు పురాణాల్లో మాత్రమే విన్నామని.. వాస్తవంగా జరగడం మొదటిసారి అని పేర్కొంటున్నారు. కాగా ఈ పరిణామంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మూడో పెళ్లి చేసుకోగా ఆమెకు సంతానం కలగకుంటే మరో వివాహం చేసుకుంటాడా? అని మహిళలు ప్రశ్నిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి