Balakrishna Honored with Padma Bhushan:ఒకే కుటుంబం నుంచి తండ్రీ కుమారులు ఇద్దరు పద్మ అవార్డులు అందుకోవడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అవును అప్పట్లో 1968లో అన్న ఎన్టీఆర్ ని అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఆయనతో పాటు ఏఎన్నార్ కు కూడా పద్మశ్రీ ప్రకటించడం విశేషం. దాదాపు 57 యేళ్ల తర్వాత నందమూరి తారక రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ పద్మభూషణుడయ్యారు.
తండ్రి ఎన్టీఆర్ పద్మశ్రీ అందుకుంటే.. తనయుడు ఏకంగా పద్మభూషణుడయ్యాడు. తెలుగు సహా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి తండ్రీ కొడుకులు ఇద్దరు పద్మ అవార్డులు ఎవరు అందుకోలేదు. అదే హిందీ చిత్రసీమలో పృథ్వీరాజ్ కపూర్.. 1969లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత ఆయన తనయుడు బాలీవుడ్ షో మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కపూర్.. రెండేళ్లకే 1971లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత చాలా యేళ్లకు పృథ్వీరాజ్ కపూర్ చిన్న కుమారుడు.. రాజ్ కపూర్ చిన్న తమ్ముడు శశి కపూర్ ను 2011లో కేంద్రం పద్మభూషణ్ అవార్డు అందుకోవడం విశేషం. ఇలా ఒకే ఇంటి నుంచి తండ్రీ తనయులు ముగ్గురు పద్మభూషణ్ అవార్డుతో పాటు సినీ రంగంలో అత్యున్నత పౌర పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
ఇక దక్షిణాదిన అది తెలుగులో నందమూరి తండ్రీ తనయులైన ఎన్టీఆర్, బాలయ్యలు ఇద్దరు పద్మ అవార్డులతో గౌరవించ బడటం విశేషం. బాలయ్య విషయానికొస్తే.. నందమూరి తారకరామారావు, బసవ తారకం దంపతులకు ఎనిమిదో సంతానంగా జన్మించారు. ఎన్టీఆర్ దంపతులకు ఆరో కుమారుడు. ఈయన 1960 జూన్ 10న చెన్నైలో జన్మించారు. కానీ హైదరాబాద్ లోనే పెరిగారు. అంతేకాదు 14 యేళ్ల చిన్న వయసులో ఎన్టీఆర్ ఓన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘తాతమ్మ కల’ చిత్రంతో నటుడిగా పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరగకుండా నటుడిగా అనేకంటే హీరోగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే ఉన్నారు. అంతేకాదు బాలయ్య హీరోగా తెరకెక్కిన ఎక్కువ సినిమాల్లో టైటిల్ రోల్స్ చేయడం విశేషం. హీరోగా 50 యేళ్ల నట ప్రస్థానంలో జానపద, పౌరాణిక, చారిత్రక, సోషల్, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్స్ సినిమాల్లో నటించారు. ఈ యేడాది సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. త్వరలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2 తాండవం’ సినిమాతో పలకరించబోతున్నారు. అటు గోపీచంద్ మలినేనితో ఓ యాక్షన్ సినిమాతో పాటు రజినీకాంత్, నెల్సన్ కాంబోలో వస్తోన్న ‘జైలర్ 2’ లో పవర్ ఫుల్ రోల్లో నటించబోతున్నట్టు సమాచారం. నందమూరి బాలకృష్ణ తన తరంలో అన్ని జానర్స్ లో చిత్రాలు చేసిన ఏకైక హీరోగా రికార్డు క్రియేట్ చేశారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.