Dil Raju: దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. చివరికి తేలింది ఏమిటంటే!

Dil Raju IT Raids Update: గత మూడు రోజులుగా టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటి సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఆ సోదాలు కాస్త నిన్నటితో పూర్తి అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 24, 2025, 08:30 AM IST
Dil Raju: దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు.. చివరికి తేలింది ఏమిటంటే!

Dil Raju IT Raids Concluded: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న దిల్ రాజు ఈ సంక్రాంతికి రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ , వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను నిర్మించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో వచ్చిన చిత్రాలు,  కలెక్షన్లు కూడా జోరుగానే వచ్చాయి.  ముఖ్యంగా గేమ్ ఛేంజర్ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ దాదాపు రూ.186కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసినట్లు మొదటి రోజే పోస్టర్లు రివీల్ చేశారు.

అటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిపోయింది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ ఈవెంట్ ని కూడా ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలే కాదు ఈ సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ డాకు మహారాజు నైజాం హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ సినిమా కూడా కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. 

ఈ నేపథ్యంలోనే కలెక్షన్లు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో వీటికి టాక్స్ సరైన రీతిలో చెల్లించారా లేదా అనే విషయం పై తనిఖీ చేయడానికి దాదాపు 200 మంది ఐటి అధికారులు రంగంలోకి దిగారు. అందులో భాగంగానే నిర్మాత దిల్ రాజుతోపాటు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని,  వై రవిశంకర్ నివాసాలలో, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు. అంతేకాదు అభిషేక్ అగర్వాల్,  దిల్ రాజు కూతురు హన్సితారెడ్డి తోపాటు శిరీష్ అలాగే డైరెక్టర్ సుకుమార్ ఇళ్లల్లో కూడా సోదాలు నిర్వహించారు. 

మూడు రోజులపాటు నిర్విరామంగా సాగిన ఈ దాడులలో గురువారం అర్ధరాత్రి దిల్ రాజు ఇంట్లో సోదాలు ముగిసాయి.  ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు.. పెట్టిన పెట్టుబడి అలాగే మిగతా వివరాలను కూడా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.  మొత్తం మూడు రోజులపాటు 16 చోట్ల సోదాలు నిర్వహించనిటి అధికారులు 55 బృందాలుగా విడిపోయి సినీ నిర్మాతలు డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు చేసినట్లు సమాచారం.

Also Read: Amazon Investment: మరో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు.. అమెజాన్ అడ్డాాగా తెలంగాణ

Also Read: PRC And DAs: వేతన సవరణ సంఘం, డీఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News