Vijayasai Reddy Retirement: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. వైఎస్ జగన్‌కు అత్యంత ఆప్తుడు, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. విజయ సాయిరెడ్డి నిర్ణయంతో వైఎస్ జగన్‌తోపాటు వైఎస్సార్‌సీపీ కూడా తీవ్ర విస్మయానికి గురయ్యింది. అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలగడం వెనుక ఏం జరిగిందనేది హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Amaravati: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్.. రాజధాని అమరావతికి ముహూర్తం ఫిక్స్
అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. 'రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా' అంటూ 'ఎక్స్'లో విజయ సాయిరెడ్డి పోస్టు చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఏ రాజకీయపార్టీలో చేరడంలేదని స్పష్టం చేశారు. వేరే పదవుల్లో.. ప్రయోజనాలు.. లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదని వివరించారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని ప్రకటించారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు.. ఎవరూ ప్రభావితం చేయలేదని వివరణ ఇచ్చారు.
'నాలుగు దశాబ్దాలుగా.. మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నా. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు.. నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన వైఎస్ భారతికి సదా కృతజ్ఞుడిని. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా' అని విజయ సాయిరెడ్డి ఆకాంక్షించారు. 'పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా.. రాజ్యసభలో ఫ్లోర్ లీడర్‌గా.. వైఎస్సార్‌సీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా.. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా' అని వివరించారు.
'దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని.. మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది' అని విజయ సాయిరెడ్డి పేర్కొనడం గమనార్హం.
రాజకీయాల నుంచి వైదొలిగాక తన భవిష్యత్‌పై కూడా విజయ సాయిరెడ్డి స్పష్టత ఇచ్చారు. 'నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకుప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా' అని విజయ సాయిరెడ్డి ప్రకటించారు.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.