Viral Video: అంత భయంకరమైన పామును ఎలా పట్టేశావయ్యా.. కింగ్ కోబ్రా వైరల్ వీడియో చూశారా..!

King Cobra Viral Video In Social Media: భారీ కింగ్ కోబ్రా అలవోకగా పట్టేసిన ఓ వ్యక్తి.. దాన్ని చేతుల్లోకి తీసుకుని వీడియోకు పోజులు ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు లైక్స్‌, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2023, 09:25 PM IST
Viral Video: అంత భయంకరమైన పామును ఎలా పట్టేశావయ్యా.. కింగ్ కోబ్రా వైరల్ వీడియో చూశారా..!

King Cobra Viral Video In Social Media: చిన్న పామును చూసినా.. చాలా మంది భయపడిపోయి దరిదాపుల్లోకి కూడా రారు. కానీ స్నేక్ క్యాచర్లు మాత్రం ఎంతపెద్ద పాములను అయినా అలవోకగా పట్టేస్తూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఒళ్లు గగుర్పొడించే పాములకు సంబంధించిన వీడయోలు నెట్టింట ఇటీవల వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి వీడియో తెరపైకి వచ్చింది. ఓ వ్యక్తి భారీ కింగ్ కోబ్రాను నిర్భయంగా పట్టుకుని.. వీడియోకు పోజులివ్వడం షాక్‌కు గురిచేస్తోంది. అయితే పాములంటే భయం ఉన్న వాళ్లు ఈ వీడియోను చూడకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కింగ్ కోబ్రా భయంకరంగా ఉంది. భారీ సైజులో ఉన్న ఈ పాము ఆ వ్యక్తి చేతిలో బంధిగా మారిపోయింది. 

నెట్టింట తెగ హాల్‌చల్‌ చేస్తున్న ఈ వీడియోను @sahabatalamreal అనే ఓ యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ గ్రిప్పింగ్ క్లిప్‌లో ఓ వ్యక్తి ఈ భయంకరమైన కింగ్ కోబ్రాను పట్టుకుని గాల్లోకి లేపాడు. ఈ వీడియోను షేర్ చేసినప్పటి నుంచి 4 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "ఇది ఒక భయంకరమైన పాము.. ఆ వ్యక్తి అంత ఈజీగా ఎలా పట్టుకున్నాడు" అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

"ఆ పాము చాలా గంభీరంగా కనిపిస్తోంది. కానీ రియల్‌గా ఆ పాము ఎదురుపడితే.. నిస్సందేహంగా నా వెన్నెముకలో వణుకు పడుతుంది.." అని మరొక వినియోగదారు కామెంట్ చేశారు. ఆ పామును బంధించి మంచి పని చేశారు. ఎవరిపై అయినా దాడి చేస్తే ఏంటి పరిస్థితి అని అంటున్నారు. అతని ధైర్యాన్ని మెచ్చుకున్నారు. చప్పట్లు కొట్టి అభినందించారు. ఒక వినియోగదారు నాగుపామును "అద్భుతమైన రాజు"గా అభివర్ణించారు. "చూడడానికి చాలా భయంగా ఉంది.. ఎలా పట్టేశావు భయ్యా" అని మరో నెటిజన్ అడిగాడు. ఆ పామును మీరూ కూడా ఓ లుక్కేయండి.

 

 
 
 
 
 

Also Read: Sumanth: విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన హీరో సుమంత్.. కొత్త సినిమా నామకరణం

Also Read: Infinix Zero Ultra Price: 200MP కెమెరా Infinix Zero Ultra మొబైల్ కేవలం రూ. 8,599కే పొందండి..మళ్లీ మళ్లీ రాని డీల్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News