WhatsApp Stickers Shortcut feature: ప్రైవసీ పాలసీ అప్‌డేట్ వివాదం అనంతరం ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవల ఫ్లాష్ కాల్, ఎన్‌క్రిప్టెట్ ఛాట్ బ్యాకప్, ఛాట్ మైగ్రేషన్ టూల్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు అందించింది. గ్రూప్ వీడియో కాలింగ్ పరిమితిని సైతం పెంచింది.
ఫేస్‌బుక్ పేరెంట్ కంపెనీగా ఉన్న వాట్సాప్ తన యాప్‌లలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులు ఎంతగానో వాట్సాప్ స్టిక్కర్ల కోసం సెర్చ్ చేయడం ఇకనుంచి సులభతరం కానుంది. సులభం కానుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు సెర్చ్ ఫర్ స్టిక్కర్ అనే కొత్త ఫీచర్‌ను రిలీజ్ చేసి ప్రయోగానికి సిద్ధమైంది. మరోవైపు వాట్సాప్ ప్రైవసీ పాలసీ (WhatsApp Privacy Policy) అప్‌డేట్ చేసుకోవాలని వినియోగదారులకు నోటిఫికేషన్ డిప్‌ప్లే చేస్తుంది.
Also Read: Sun Halo in Hyderabad: తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ఆకాశంలో అద్భుతం, Photo Gallery
ఛాట్ బాక్స్ ఓపెన్ చేశాక మీరు పదాలు టైప్ చేసి స్టిక్కర్లను తీసుకోవచ్చు. వినియోగదారుల స్టిక్కర్ లైబ్రరీలో సేవ్ చేసిన ఏదైనా స్టిక్కర్‌లతో వెతకడానికి కూడా అవకాశం కల్పించింది. మీరు ఏదైనా కీవర్డ్ టైప్ చేస్తే అందుకు సంబంధించిన స్టిక్కర్లను అందించే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ వెర్షన్ 2.21.12.1లో వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు తీసుకొచ్చింది. ఇటీవల ప్లేబ్యాక్స్ స్పీడ్ ఫర్ వాయిస్ మెస్సేజ్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ వినియోగదారులకు, డెస్క్‌టాప్ యూజర్ల కోసం లాంచ్ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook