Zombie Virus US Viral Video, People walking and Acting Strange in Philadelphia Streets: శాస్త్రవేత్తలు కొద్ది రోజుల క్రితం రెండు డజనుకు పైగా డేంజరస్ వైరస్‌లను కనుగొన్నారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వైరస్లలో కొన్ని సముద్రాల్లో ఉన్నాయని, 48,500 సంవత్సరాల కంటే పాతది అని వార్తలు వచ్చాయి. శాస్త్రవేత్తలు 13 కొత్త వ్యాధికారకాలను కూడా పునరుద్ధరించారు. ఓ దానికి జోంబీ వైరస్ అని పేరు పెట్టారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ఈ వైరస్ గడ్డకట్టిన మంచులో వేల సంవత్సరాల పాటు సజీవంగా ఉందట. అమెరికాలోని ఫిలడెల్ఫియా వీధుల్లో జోంబీలు పగటిపూటనే రోడ్లపై తిరుగుతున్నట్లు కొన్ని దృశ్యాలు కనిపించాయి.
అమెరికాలోని ఫిలడెల్ఫియా వీధుల్లో కొందరు జనాలు చాలా వింతగా ప్రవర్తించారు. ఫిలడెల్ఫియా రోడ్లపై ఒక స్త్రీ నోరు తెరిచి గట్టిగా అరిచింది. జాంబీలు ఎలా ప్రవర్తిస్తాయో అలానే నడుస్తూ గట్టిగా అరిచింది. ఆమెకు ఏమీ తెలియనట్టుగానే రోడ్డుపై నడవడానికి ప్రయత్నిస్తోంది. పక్కనే మరో వ్యక్తి కూడా వింతగా ప్రవర్తిస్తూ కనిపించాడు. వంగి నేలపై చూస్తూ అలానే ఉండిపోయాడు. ఈ ఘటనని ఎవరో తన మొబైల్ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Brooo, what’s happening in the USA🙆🏽♂️💀? pic.twitter.com/hUJCjZ5Xlx
— Oyindamola🙄 (@dammiedammie35) December 6, 2022
జాంబీలకు సంబందించిన వీడియోను '@Oyindamola' అనే ట్విట్టర్లో పోస్ట్ చేసారు. వీడియోను షేర్ చేస్తూ... 'సోదరా అమెరికాలో ఏమి జరుగుతోంది?' అని క్యాప్షన్‌లో పేర్కొన్నారు. ఈ వీడియోకి ఇప్పటివరకు 2 లక్షల 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన కొంతమంది కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. వీరికి జాంబీస్ వైరస్ సోకిందా లేదా డ్రగ్స్ తీసుకున్నారా?, ఎవరైనా ప్రాంక్ వీడియో చేశారా?, సినిమా షూటింగ్ కోసమే ఇదంతా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: IND Vs BAN: సెంచరీ బాదిన మెహిదీ హసన్.. భారత్ ముందు భారీ టార్గెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.