Jupiter and Sun conjunction 2023: వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహ సంచారం ముఖ్యమైనది. గ్రహాల కదలికలో మార్పు ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. 12 ఏళ్ల తర్వాత అరుదైన గ్రహాల కలయిక ఏర్పడనుంది. గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు మరియు దేవతల గురువైన బృహస్పతి కలయిక మేషరాశిలో ఏర్పడబోతుంది. ఈ కూటమి ప్రభావం ఏ రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
గురు-సూర్య కలయిక ఈ రాశులకు శుభప్రదం
మేషం
బృహస్పతి-సూర్య సంయోగం ఈ రాశిలోనే ఏర్పడబోతుంది. దీని కారణంగా మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో రెట్టింపు లాభాలను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈరాశుల కలయిక మేషరాశివారికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది.
మిథునం
సూర్యుడు, గురు గ్రహ కలయిక మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు అనేక అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ కెరీర్ అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు రాణిస్తారు. మీరు భారీగా సంపదను కూడబెడతారు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది.
తుల
ఏప్రిల్‌లో గురు, సూర్యుల అరుదైన కలయిక తులారాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరి బిజినెస్ వృద్ధి చెందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీ వివాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Venus Transit 2023: మార్చిలో రాహు-శుక్ర యుతి.. హోలీ తర్వాత వీరికి కెరీర్ లో మంచి పురోగతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.