Jupiter Retrograde 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్క గ్రహాన్ని ఒక్కోలా పిలుస్తారు. ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. అందుకే గ్రహాల కదలిక ఇతర రాశులపై స్పష్టమైన ప్రభావం కల్గిస్తుంది. కొన్ని రాశులకు అనుకూలంగా, మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండవచ్చు.
గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలో గోచారం చేసినట్టే తిరోగమనం కూడా చేస్తుంటాయి. దీనినే వక్రమార్గం అని కూడా పిలుస్తారు. గురుగ్రహం వక్రస్థితిలో మకర రాశి జాతకులకు అనుకూలంగా మారనుంది. కెరీర్ పరంగా ఉన్నత స్థితిని కల్పిస్తుంది. మీరు పనిచేసే చోట ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. మీ ఎదుగుదలకు ఏవిధమైన ఇబ్బంది తలెత్తదు. డిసెంబర్ నెల వరకూ అంతా సుఖమయంగా ఉంటుంది. ఈలోగా పాత సమస్యల్నించి విముక్తి లభిస్తుంది. ఒత్తిడి కూడా తొలగిపోతుంది. కుటుంబంలో సోదర సోదరీమణుల మధ్య బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
గురుడు సెప్టెంబర్ 4వ తేదీన వక్రమార్గం పట్టాడు. ఈ స్థితిలో డిసెంబర్ 31 ఉదయం 8.10 గంటల వరకూ ఉండటం వల్ల మకర రాశి జాతకులు చాలా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యాలన్నీ పూర్తవుతాయి. కెరీర్‌పరంగా మంచి స్థితిలో ఉంటారు. మీరు చేసిన పనికి మీ పై అధికారులు ప్రశంసిస్తారు. పనిచేసేచోట మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారులు మాత్రం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతాయి. కొత్త ఇళ్లు కొనుగోలుకు ఆలోచిస్తుంటే..కాస్సేపు ఆగడం మంచిది. వ్యాపార విషయాల్లో నిర్ణయాలను పునరాలోచించుకోవాలి. ఒకటికి రెండుసార్లు అన్ని విషయాల్ని ఆలోచించిన తరువాతే ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు ఎదురౌతాయి.
ఈ రాశి జాతకులకు గురుడు వక్రస్థానంలో డిసెంబర్ 31 వరకూ ఉండటం వల్ల తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. తెలిసో తెలియకో చేసిన తప్పుల కారణంగా ఇతరుల మనస్సు నొప్పించి ఉంటే క్షమాపణలు కోరేందుకు సమయం ఉంటుంది. ఇంటికి బంధువులు రావచ్చు. మరోవైపు సోదర, సోదరీమణుల మధ్య బేధాభిప్రాయం తలెత్తవచ్చు. మీ బాద్యతలేంటో గుర్తెరిగి మసలుకుంటే మంచిదంటున్నారు.
Also read: Nostradamus 2023: నోస్ట్రాడామస్ అంచనాలు నిజమౌతున్నాయా, మూడో ప్రపంచ యుద్ధమెప్పుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook