Budh Gochar 2023: ఫిబ్రవరి నెల వివిధ గ్రహాల గోచారం కారణంగా అత్యంత మహత్యం, ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెలలో బుధ, శుక్ర, సూర్య గ్రహాల రాశి పరివర్తనం ఉంది. అటు మకర రాశిలో సూర్యుడు ముందు నుంచే ఉండటం, ఫిబ్రవరి 7 న బుధుడు గోచారం చేయడం మహత్యం కలిగింది. ఇదే విధంగా శని రాశి మకరంలో బుధ, సూర్య గ్రహాల యుతితో బుధాదిత్య యోగం ఏర్పడనుంది. ఫలితంగా 12 రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా 5 రాశులకు మాత్రం అత్యంత శుభ సూచకంగా మారనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
బుధ గోచారంతో 5 రాశులపై ప్రభావం
మేషరాశి
మకర రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడటం మేషరాశి వారికి అత్యంత లాభదాయకంగా మారుతుంది. ప్రత్యేకించి ఉద్యోగం కోసం ఎదురుచూసేవారికి ఆ సమస్య తొలగిపోతుంది. కెరీర్‌లో భారీ అవకాశం లభిస్తుంది. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఇళ్లు, వాహనం కొనుగోలు చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.
తులా రాశి
బుధ గోచారంతో తులా రాశి వారికి భారీగా ధనలాభముంటుంది. సంపదకు సంబంధించిన చాలా విషయాలు పరిష్కారమౌతాయి. ఇది మీకు అత్యంత శుభసూచకం కానుంది. చాలా శుభవార్తలు వింటారు. భారీ లాభాలు కలుగుతాయి.
కర్కాటక రాశి
బుధ గోచారం కర్కాట రాశివారికి భారీ సాఫల్యతను ఇస్తుంది. ధనలాభం కలుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. పనులు పూర్తవుతాయి. ఒకవేళ కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే అత్యంత అనువైన సమయం. ప్రత్యర్ధులు సైతం ఓడిపోతారు.
సింహ రాశి
సూర్య, బుధ గ్రహాల యుతి కారణంగా ఏర్పడే బుధాదిత్య యోగం సింహరాశివారికి పెద్దఎత్తున లాభాల్ని ఆర్జిస్తుంది. పనుల్లో విజయం అందుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సామాజికంగా యాక్టివ్ గా ఉంటారు. అత్తారింటి నుంచి లాభం వస్తుంది. పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి
బుధ గోచారంతో మీనరాశి వారికి మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. జీతం పెరుగుతుంది. నచ్చిన చోటికి బదిలీ కావచ్చు. కీలకమైన కోర్కెలు పూర్తవుతాయి.
Also read: Guru Chandal Yog: గురు చండాల యోగంతో ఈ రాశులకు కష్టాలు... ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook