Friday Tips to Get Goddess Lakshmi Devi Blessings: శుక్రవారం అనగానే మనకు లక్ష్మీ దేవత గుర్తుకొస్తుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీ దేవిని ఆరాధించాల్సిన రోజు. శుక్రవారం లక్ష్మీ పూజ చేస్తే సకల సంపదలు, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎప్పుడూ ధనం ఉండాలి.. ఇల్లు సంపదలతో తులతూగాలి అంటే కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
శుక్రవారం పాటించాల్సిన నియమాలు :
1) ఇంట్లో ఎప్పుడూ పసుపు, ఉప్పు అయిపోవడమనే ప్రసక్తి ఉండకూడదు. అయిపోయేంతవరకూ వాటిని వినియోగిస్తూ ఉండవద్దు. పసుపు, ఉప్పు ఇక అయిపోతున్నాయనుకుంటే.. కొత్త సరుకు తీసుకొచ్చి వాటికి జోడించాలి. అలాగే, ప్రతీ ఇంట్లో బియ్యం డబ్బాలో బియ్యం కొలిచే కొలపాత్ర ఉంటుంది. దాన్ని ఎప్పుడూ బోర్లించి ఉండకూడదు.
2) విడిచిన దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో ధరించరాదు. విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్రం చుట్టుకుంటుంది. విడిచిన దుస్తులను తలుపులకు తగిలించరాదు.
3) సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసం ముట్టుకోవద్దు. పాలు తీసుకోవాలి.
4) సూర్యోదయం కన్నా ముందే ఇంటిని శుభ్రపరిచి, తలస్నానం చేసి ఇంట్లోని పూజ గదిలో దీపాలు వెలిగించాలి.
5) రాత్రి వేళ భోజనం తర్వాత గిన్నెలను ఖాళీగా ఉంచకూడదు. అన్న పాత్రల్లో కాస్తయినా అన్నాన్ని ఉంచాలి. అలా ఉంచడం ద్వారా పితృ దేవతల అనుగ్రహం లభిస్తుంది.
6) తప్పనిసరిగా నుదుట కుంకుమ ధరించాలి. మిగతావారాల్లో కుంకుమ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా శుక్రవారం ఇది తప్పనిసరి. కుంకమ ధరించడం ద్వారా వివాహిత స్త్రీలకు కలకాలం సౌభాగ్యం నిలిచి ఉంటుంది.
7) కుంకమకు బదులు టిక్లీలు పెట్టుకోవద్దు. కుంకమ మాత్రమే ధరించాలి. తద్వారా రజోగుణమైన శుక్రుడి అనుగ్రహం లభిస్తుంది.
8) శుక్రుడికి తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి. అలాగే లక్ష్మీదేవికి కూడా తెల్లని వస్త్రాలు ప్రీతిపాత్రమైనవి. కాబట్టి తెల్లని దుస్తులు ధరిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.
9) వీలైతే తామరలు, పద్మములతో లక్ష్మీదేవిని పూజిస్తే ఆ దేవత అనుగ్రహం లభిస్తుంది. అలాగే, అన్నదానం, వస్త్రదానం, పుష్ప దానం చేసినా శుభ ఫలితాలు కలుగుతాయి.
10) వర్జ్యం ఉన్న సమయంలో మౌనవ్రతం పాటించడం మంచిది. ఆ సమయంలో ఎవరితోనూ ఏమీ మాట్లాడవద్దు. తద్వారా ఆ ఇంట్లో ధన సమృద్ధి కలిగే అవకాశం ఉంటుంది.
(గమనిక : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, ఊహలపై ఆధారపడి ఉండొచ్చు. జీ న్యూస్ దానిని ధ్రువీకరించలేదు)
Also Read: Harish Rao: ఈ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు... ప్రధాని నరేంద్ర మోదీకి హరీశ్ రావు గట్టి కౌంటర్...
Also Read: Banking Rules: నేటి నుంచి కొత్త రూల్స్... ఆ పరిమితి దాటే లావాదేవీలకు ఆధార్, పాన్ తప్పనిసరి...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి