Horoscope Today May 15 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే... కొన్ని రాశుల వారికి జీవిత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తవచ్చు. ముక్కుసూటితనం, మాటలను అదుపులో పెట్టుకోకపోవడం వల్ల విభేదాలు కొనితెచ్చుకుంటారు. కొన్ని రాశుల వారికి అనుకోని విధంగా బహుమతులు అందుతాయి. ఇవాళ్టి రాశి ఫలాల్లో ఏయే రాశులకు ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి..
మేషరాశి ( Aries)
మీరు మానసికంగా కలవరపడవచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులు లేదా బంధవుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఈరోజు శుభదినం. మీరు వ్యాపారంలో కష్టపడి పనిచేయవలసి రావచ్చు. పాత స్నేహితుడు ఒకరిని కలిసే అవకాశం ఉంటుంది. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి ప్లాన్ చేస్తారు. అన్ని పనుల్లో మీకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది.
వృషభ రాశి (Taurus)
ఆకస్మిక ధనలాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. లేనిపక్షంలో వివాదాలు తలెత్తవచ్చు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఈరోజు అనుకూలం. అరువుగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లిస్తారు. మీ ప్రియురాలు లేదా ప్రియుడి నుంచి బహుమతి అందుకుంటారు.
మిథున రాశి (GEMINI)
ఈరోజు ప్రారంభంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ముక్కుసూటితనం కొన్నిసార్లు పనిచేయదు. వ్యాపారంలో కష్టపడి పనిచేయవలసి రావచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే నష్టం జరగవచ్చు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్చు.
కర్కాటక రాశి (Cancer)
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో స్నేహితుల మద్దతు పొందుతారు. వ్యాపారంలో సాధారణ లాభం ఉంటుంది. ఈ రోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనూ రహస్య విషయాలను పంచుకోకండి. అలా చేస్తే ద్రోహం జరగవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పిల్లల చదువు పట్ల కూడా శ్రద్ధ పెట్టండి.
సింహ రాశి (LEO)
మీ ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగంలో పురోగతి సాధ్యమవుతుంది. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పనిచేసే చోట అధికారులతో సమన్వయం పాటించండి. వ్యాపార నిమిత్తం పెట్టిన పెట్టుబడులు ధన లాభం తీసుకొస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తల్లిదండ్రులను బాధపెట్టే పనులు చేయవద్దు.
కన్య రాశి (Virgo)
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాలకు తోచిన ఆర్థిక సాయం చేస్తారు. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు తలెత్తే అవకాశం.
తులా రాశి (Libra)
మనసు ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. వ్యాపారంలో నష్టం రావచ్చు. విద్యాపరమైన పనుల పట్ల ఆసక్తి చూపుతారు. కోపాన్ని నియంత్రించుకోండి.. లేకపోతే వివాదాలు ఎదుర్కొంటారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు,.. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇది మంచి రోజు.
వృశ్చిక రాశి (Scorpio)
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆఫీసులో అధికారుల సహకారం ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. లేనిపక్షంలో నష్టాలు చవిచూస్తారు. మీరు విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి మతపరమైన యాత్రకు వెళ్ళవచ్చు. స్నేహితుల మద్దతు పొందుతారు. అనుకోని బహుమతి మీకు అందే అవకాశం ఉంది.
ధనుస్సు రాశి (Sagittarius)
జీవితం ఉరుకులు, పరుగుల మీద గడుస్తుంది. ఖర్చులు ఆకస్మికంగా పెరగడం ఆర్థిక పరిస్థితిని బలహీనపరుస్తుంది. కుటుంబ పరంగా అదనపు బాధ్యతలు మీద పడుతాయి. అన్నింటా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రుల మద్దతు పొందుతారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలలో మోసం జరగవచ్చు.
మకర రాశి (Capricorn)
ఆదాయ వనరు పెరుగుతుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు ఉండవచ్చు. ఈ రోజు తెలిసినవారి నుంచి బహుమతిని పొందవచ్చు. వ్యాపారస్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వాహన, గృహ సుఖ సంతోషాలు కలుగుతాయి. మీ భాగస్వామితో రొమాంటిక్‌గా గడుపుతారు. అవివాహితులకు వివాహ సంబంధం రావచ్చు.
కుంభ రాశి (Aquarius)
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను అదుపులో పెట్టుకోండి. లేదంటే వివాదాల్లో ఇరుక్కుంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి దేవాలయాలను సందర్శిస్తారు. సాయంత్రం స్నేహితులతో కలిసి పార్టీకి వెళ్తారు. ప్రియురాలు లేదా ప్రియుడితో కలిసి షాపింగ్ చేస్తారు. ప్రియురాలు లేదా ప్రియుడి నుంచి బహుమతి పొందుతారు.
మీన రాశి (Pisces)
కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కొన్ని శుభవార్తలు అందినందుకు మనసు సంతోషిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి, ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. అభిరుచితో తీసుకున్న నిర్ణయం ఒకటి ప్రాణాంతకం కావచ్చు. జీవిత భాగస్వామి ఈరోజు మీ మనసులోని విషయాలను నెరవేరుస్తారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లవచ్చు.
Also Read: Mahesh Babu vs Mega Fans: సర్కారు వారి పాట సినిమాపై మెగా హీరోల మౌనానికి కారణం
Also Read: Chandrababu Naidu: కుప్పం పర్యటనలో జూ.ఎన్టీఆర్ అభిమానిపై ఫైర్ అయిన చంద్రబాబు నాయుడు..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.