Guru Asta Effect On Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వివాహం, సంతానం, అదృష్టం, సంపద, విద్య మొదలైన వాటికి కారకుడు బృహస్పతి. ఏదైనా రాశికి గురుడు అస్తమయం అనేది శుభప్రదం కాదు. బృహస్పతి సెట్ సమయంలో నిశ్చితార్థం, పెళ్లి, నామకరణం వంటి శుభకార్యాలు నిర్వహించకూడదని అంటారు. మీనరాశిలో మార్చి 28న గురుడు అస్తమించనున్నాడు. సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 22న బృహస్పతి మీనరాశిని విడిచిపెట్టి మీష రాశిలోకి ప్రవేశించనుంది. మీనరాశి వారు శాంతియుతంగా ఉంటే.. దాని విరుద్దంగా మేషరాశి వారు ఉంటారు. మీనరాశికి అధిపతి గురుడు. దీని కారణంగా బృహస్పతి అస్తమయ సమయంలో కుంభం మరియు మీన రాశి వారు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
కుంభంపై గురు అస్తమయ ప్రభావం
జ్యోతిషశాస్త్రం ప్రకారం, కుంభరాశి యెుక్క 2వ మరియు 11వ ఇంటికి బృహస్పతిని అధిపతిగా పరిగణిస్తారు. బృహస్పతి మీనం యొక్క రెండో ఇంటిలో మరియు మేషం యొక్క మూడవ ఇంటిలో అస్తమిస్తాడు. దీని వల్ల కుంభరాశి వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోండి. కుంభ రాశి వారు గురువారం గురు మంత్రం మరియు గాయత్రీ ఏకాక్షరీ బీజ మంత్రం 'ఓం బృహస్పతయే నమః' జపించడం వల్ల మేలు జరుగుతుంది.
మీన రాశిపై బృహస్పతి ప్రభావం
ఆస్ట్రాలజీ ప్రకారం, బృహస్పతి లగ్నానికి మరియు మీన రాశి యెుక్క 10వ ఇల్లుకు అధిపతి. బృహస్పతి మీనం యెుక్క ఆరోహణ గృహంలో అస్తమిస్తాడు మరియు మేషం యొక్క రెండో ఇంటిలో ఉంటాడు. ఈ సమయంలో మీనరాశివారు ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. మీ పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. కుటుంబానికి తగినతం సమయం కేటాయించలేరు. మీ జాతకంలో బృహస్పతిని బలపరచడానికి పసుపు రంగు దుస్తులను ధరించండి.
Also Read: Navpancham Yog 2023: 'నవపంచం రాజయోగం' చేస్తున్న కుజుడు-శని... ఈ రాశుల ఇంటిపై డబ్బు వర్షం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK