Lambodara Sankashti Chaturthi: హిందూ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి (కృష్ణ పక్షం) తర్వాత నాల్గో రోజున గణేశుడిని ప్రార్థిస్తూ లంబోదర సంకష్టి చతుర్థిని జరుపుకుంటారు. ఈ ఏడాది జనవరి 21, శుక్రవారం రోజున (January 21, Friday) లంబోదర సంకష్టి చతుర్థి వచ్చింది.
సంకష్టి అనేది సంస్కృత పదం, దీని అర్థం 'కష్టాలను నుంచి రక్షించడం' అయితే ఈ లంబోదర సంకష్టి చతుర్థి.. మంగళవారం రోజు వస్తే దాన్ని అంగారకి సంకష్టి చతుర్థి అని అంటారు. ఇతర సంకష్టి చతుర్థుల కంటే ఇలా మంగళవారం వచ్చే చతుర్థికి ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది.
లంబోదర సంకష్టి చతుర్థి (Lambodara Sankashti Chaturthi) ఈనాటిది కాదు.. 700 BC కాలం నుంచి ఈ పండుగను జరుపుకుంటున్నారు. ఇక సంకష్టి రోజున చంద్రోదయం - రాత్రి 09:00న ఉంటుంది. చతుర్థి తిథి - జనవరి 21, 2022న ఉదయం 08:51 కి ప్రారంభం అవుతుంది. చతుర్థి తిథి - జనవరి 22, 2022న ఉదయం 09:14కి ముగుస్తుంది.
సంకష్టి చతుర్థి (Sankashti Chaturthi) రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానాలు చేసి గణేశుడిని పూజిస్తే ఎంతో మంచిదని భక్తుల విశ్వాసం. ఇక గణేశుడిని వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభ.. నిర్విగ్నం కురుమేదేవా..సర్వ కార్వేషు సర్వదా అంటూ శ్లోకం చదువుతూ పూజిస్తే లంబోదరుడి ఆశీర్వాదం లభిస్తుందని భక్తుల నమ్మకం.
Also Read : Pushpa Dialogue video: కిలి పాల్ నోట పుష్ప ఫ్లవర్ డైలాగ్.. నీయవ్వ తగ్గేదెలే!
ఇక లంబోదర సంకష్టి చతుర్థి రోజున గణేశుడిని తలుచుకుంటూ కొందరు భక్తులు ఉపవాసాన్ని కూడా పాటిస్తారు. ఇలా ఎంతో భక్తిశ్రద్ధలతో లంబోదర సంకష్టి చతుర్థి రోజున గణేశుడిని (Lord Ganesha) పూజిస్తే కోరిన కోర్కెలన్నీ తీర్చుతాడట వినాయకుడు.
Also Read : Corona Third wave: తండ్రీకొడుకులైన స్టార్ హీరోలకు వారం గ్యాప్‌లో కొవిడ్ పాజిటివ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook